Suryakumar Yadav : టీమిండియా మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఇటీవల ఆయన ఐసీసీ మెన్స్ టీ20 లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత సూర్యకుమార్ తన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్నాడు. రికార్డుల శ్రేణులను బద్దలు కొడుతున్న ఈ బ్యాట్స్‌మెన్ టీ 20 ఫార్మాట్‌లో మునుపెన్నడూ లేని విధంగా సత్తా చాటుతున్నాడు. టీ20 లలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ బ్యాటర్‌గా నిలిచిన సూర్య కుమార్ 31 మ్యాచ్‌లలో 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు
సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2022 సంవత్సరానికి గుడ్ బై చెప్పాడు. అయితే టీ 20లలో బాగా రాణిస్తున్న వన్డేలలో మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ 20 మ్యాచ్‌లు ఆడుతుండగా, ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్య చేసిన ఒక పనితో అతనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఫిలిప్స్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ మూడో బంతిని సూర్య స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా, బాల్ బ్యాట్, ప్యాడ్స్‌ను తాకి బ్యాక్‌వర్డ్ పాయింట్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే సింగిల్ వస్తుందని భావించిన సూర్య నాన్‌స్ట్రైకర్ ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ వద్దూ..
వద్దూ.. అని ఎంత అరుస్తున్నా కూడా అవతలి క్రీజ్ చేరుకున్నాడు. అయితే అప్పటికే బాల్ అందుకున్న టిక్నర్ కీపర్‌కు బాల్ అందించడంతో వాషింగ్టన్ సుందర్ రనౌట్ కావల్సి వచ్చింది.. సూర్య కోసం తన వికెట్‌ను సుందర్ త్యాగం చేశాడు. అదే స్థానంలో విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మనో ఉండి ఉంటే.. సూర్య కుమార్ యాదవ్‌నే తమ వికెట్ త్యాగం చేయాల్సి వచ్చేది. అయితే వాషింగ్టన్ అవుటైన కూడా సూర్య కుమార్ చివరి వరకు క్రీజ్ లో నిలిచి భారత్ విజయానికి దోహదపడ్డాడు. మ్యాచ్ తర్వాత సూర్య.. వాషింగ్టన్ సుందర్‌కు సారీ చెప్పి, తన తప్పు వల్లనే సుందర్ అవుట్ అయ్యడని చెప్పుకు రాగా, అభిమానులు శాంతించారు. ఇంకోసారి అలా చేయకుండా బాధ్యతతో ఉండాలని సూచించారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.