Rohit Sharma : గాయం ఉన్నా మ్యాచ్ గెలిపించినంత పని చేసిన రోహిత్ శర్మ… అయినప్పటికీ తిట్టి పోస్తున్న నెటిజన్స్
Rohit Sharma : ఇటీవలి కాలంలో భారత్ ప్రదర్శన చాలా చెత్తగా ఉంది. రీసెంట్‌గా బంగ్లా చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను చేజార్చుకొని అభిమానులని నిరుత్సాహపరిచారు. అయితే సిరీస్ చేజార్చుకున్న టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్. బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడో వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్టు తెలుస్తుంది. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెప్టెన్.. అనంతరం స్కానింగ్ చేయించుకోగా.. బొటన వేలు డిస్‌లొకేట్ అయిందట. కుట్లు వేసిన డాక్టర్లు.. నొప్పి తెలియకుండా ఉండటం కోసం ఇంజెక్షన్లు ఇచ్చారట. ఇక కుట్లు వేసిన నేపథ్యంలో బ్యాటింగ్ దిగొద్దని వైద్యులు సూచించినప్పటీకీ దేశం కోసం బరిలోకి
దిగిన రోహిత్ టీమిండియాను గెలిపించడానికి చివరి బంతి వరకూ పోరాడాడు. రెండో మ్యాచ్ కూడా ఓడిపోతే సిరీస్ పోతుందని భావించిన రోహిత్ గాయంతోనే గ్రౌండ్‌లోకి దిగాడు. అయితే గాయంతో ఉన్న రోహిత్ తమని ఏం చేయలేడనని బంగ్లా ఆటగాళ్లు అనుకున్నారు. కాని బొటన వేలి గాయంతో రోహిత్ శర్మ(51 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. ఆయన పోరాటం వృథా అయింది. రోహిత్ కేవలం 28 బంతుల్లోనే 5 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి అజేయంగా నిలవగా, అతని వీర విహారానికి భారత అభిమానులు మురిసిపోయారు. అయితే రోహిత్ పోరాట పటిమపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నా కూడా మరి కొందరు విమర్శలు చేస్తున్నారు.
Rohit Sharma : పొగడ్తలు, విమర్శలు
బ్యాటింగ్ కి దిగాలనుకున్న రోహిత్ శర్మ 7 వికెట్లు పడే వరకు ఎందుకు ఆగాడంటూ ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మ ఒక్క వికెట్ ముందు వచ్చినా కూడా మ్యాచ్ గెలిచే వాళ్లు. చేతికి గాయం అయినందున రోహిత్ శర్మ గ్రౌండ్‌లో అడుగుపెట్టడని అనుకున్నాం. కాని మళ్లీ వచ్చి కచ్చితంగా ఓడిపోతామనుకున్న మ్యాచ్ మీద ఆశలు రేకెత్తించి చివర్లో ఇలా చేస్తావా అంటూ కొందరు మండిపడుతున్నారు. అయితే సిరాజ్ 12 బంతుల్లో 2 పరుగులు చేయగా, అతను కొన్ని పరుగులు చేసిన మ్యాచ్ భారత్ వైపే ఉండేది. రోహిత్ మూడో వన్డేకు దూరం అవుతాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పగా, బంగ్లాతో టెస్ట్ సిరీస్‌పై ఇప్పుడేమి చెప్పలేమని అన్నాడు.