India VS Pakistan : రిపీట్ అవుతుందా? పాకిస్తాన్ తో టీమిండియా..?
India VS Pakistan : T20 మొదటి ప్రపంచ కప్ టోర్నీ 2007 లో జరిగింది. కెప్టెన్ ధోని నాయకత్వంలో టీమిండియా మొదటి టి20 ప్రపంచ కప్ గెలిచింది. ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై ఇండియా గెలవడంతో భారతీయులు ఆ విజయాన్ని ఎంతగానో ఆస్వాదించారు. ఈ విజయం తర్వాత ధోని క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పెరిగింది. అనంతరం అన్ని ఫార్మేట్లకు ధోని నాయకత్వం వహించి ఇండియా జట్టుని అనేక శిఖరాలకు అధిరోహించేటట్టు చేసి… తిరిగి 2011వ సంవత్సరంలో ప్రపంచ కప్ గెలిచేలా చేశాడు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు టి20 ప్రపంచ కప్ టోర్నీ లో మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గెలిచి…
పాకిస్తాన్ ఫైనల్ కి చేరుకుంది. మరోపక్క టీమిండియా మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్ తో సెమీస్ లో తలపడనుంది. దీంతో ఇప్పుడు మళ్లీ 2007 పరిస్థితి… టోర్నీలో కనిపిస్తూ ఉండటంతో… రెండు దాయాది దేశాలు ఫైనల్ మ్యాచ్ ఆడాలని ప్రపంచ క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. లీగ్ దశలో భారత్, జింబాబ్వే టీం లపై ఓడిపోయిన పాకిస్తాన్ అనేక విమర్శలు ఎదుర్కోవటం జరిగింది. కానీ చివరిలో అదృష్టం కలిసొచ్చి బంగ్లాదేశ్ పై గెలవడంతో సెమీస్ లో బెర్త్ కన్ఫామ్ చేసుకోవడం జరిగింది. ఇక అదే దూకుడుతో న్యూజిలాండ్ నీ చిత్తుగా ఓడించి…
ఫైనల్ లో నిలిచి మంచి ఫామ్..లో పాకిస్తాన్ టీం ఇప్పుడు ఉంది. ఇటువంటి తరుణంలో.. ఈ ప్రపంచ కప్ టోర్నీలో మొదటి నుండి దూకుడుగా ఆడుతున్న భారత్.. ఇంగ్లాండ్ తో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో కచ్చితంగా ఫైనల్ పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ ఆడనుందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ప్రారంభంలో చిన్న టీమ్లతో ఓడిపోయిన పాకిస్తాన్.. భారత్ తో ఫైనల్ మ్యాచ్ ఎలా ఆడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో 2007 సీన్.. మళ్లీ ఈ ప్రపంచ కప్ టోర్నీలో పాక్ తో టీమిండియా రిపీట్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద డిస్కషన్ గా మారింది.