Ind Vs Aus : పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా సూపర్ విక్టరీ.. అదరగొట్టిన కుర్రాళ్లు..!
ప్రధానాంశాలు:
Ind Vs Aus : పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా సూపర్ విక్టరీ.. అదరగొట్టిన కుర్రాళ్లు..!
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాపై australia 295 పరుగుల తేడాతో భారత్ మొదటి టెస్ట్‌లో 1st Test Match ఘన విజయం సాధించింది. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో.. 534 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా టీమ్ సోమవారం ఉదయం నుంచి ఓటమికి ఎదురీదుతతూ వచ్చింది. మ్యాచ్‌లో నాలుగో రోజైన సోమవారం 12/3తో ఛేదనను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ (89: 101 బంతుల్లో 8×4) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓపెనర్లు నాథన్ (0), ఉస్మాన్ ఖవాజా (4), నైట్ వాచ్‌మెన్ పాట్ కమిన్స్ (2), మార్కస్ లబుషేన్ (3), స్టీవ్‌స్మిత్ (17) విఫలమైన పిచ్‌పై ట్రావిస్ హెడ్ అసాధారణ పోరాట పటమని కనబర్చాడు.
Ind Vs Aus అద్భుత ప్రదర్శన..
మిచెల్ మార్ష్ 47)తో కలిసి ఆరో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ట్రావిస్ హెడ్.. టీమ్ స్కోరు 161 వద్ద ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రా భారత్ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. పిచ్ బౌలర్లకి అనుకూలిస్తున్న ఈ తరుణంలో.. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోవడంతో సొంత గడ్డపై ఆసీస్ ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. అలెక్స్ క్యారీ(36 ) భారత విజయానికి కాస్త అడ్డుపడ్డ చివరికి భారత్ ఖాతాలో మంచి విజయం నమోదైంది. స్టార్క్(12), లియోన్(0)లని వాషింగ్టన్ సుందర్ పెవీలియన్ చేర్చాడు. భారత బౌలర్స్‌లో బుమ్రా మూడు వికెట్లు తీయగా, సిరాజ్ 3, వాష్టింగ్టన్ సుందర్ 2, రానా, నితీష్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ తీసారు. ఇక ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ లో 238 పరుగులకి ఆలౌట్ కాగా, ఇండియా 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ ,షమీ, గిల్ వంటి ప్లేయర్స్ లేకపోయిన కుర్రాళ్లతో భారత జట్టుని అద్భుతంగా నడిపించాడు బుమ్రా.
పెర్త్ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసింది.అనంతరం ఆస్ట్రేలియా టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే ఆలౌటవడంతో.. భారత్ జట్టుకి 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను 487/6తో డిక్లేర్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 534 టార్గెట్‌ను కంగారూల ముందు నిలిపింది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరాలంటే.. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా భారత్ జట్టు ఓడిపోకూడదు. మరి భారత్ ఎలాంటి అద్భుతం చేస్తుందో చూడాలి.