World Cup 2022 : తొమ్మిది మంది ప్లేయర్స్‌కి కరోనా.. వాళ్లు వరల్డ్ కప్ నుండి ఔట్..!
World Cup 2022: కరోనా మహమ్మారి గుబులు రేపుతుంది. టోర్నమెంట్స్, ఈవెంట్స్ వంటిపై కూడా కరోనా ఎఫెక్ట్ చూపుతుంది. అండర్-19 ప్రపంచ కప్ 2022 టోర్నీపై కూడా కరోనా కన్నెర్ర చేసింది. టోర్నీలో పాల్గొనేందుకు కరీబియన్ దీవులకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు క్యూ కట్టి కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టీమిండియాలోని ఆరుగురు ఆటగాళ్లు వైరస్ బారిన పడి, కోలుకోగా.. తాజాగా కెనడా జట్టులో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆడేవాళ్లు లేకపోవడంతో స్కాట్లాండ్ తో జరగాల్సిన మ్యాచ్ ని రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది కెనడా జట్టు.
World Cup 2022 : టెర్రర్ పుట్టిస్తున్న కరోనా..
మహమ్మారి కారణంగా పరిస్థితులు చేజారుతుండటంతో ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు క్రికెట్ కెనడా ప్రకటించింది. ‘అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ నుంచి ఇలా అర్ధాంతరంగా తప్పుకోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరమైన విషయం. అయితే కుర్రాళ్ల కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని, వారికి మెరుగైన భద్రత, వైద్య సదుపాయాలు కల్పించేందుకే స్వదేశానికి తీసుకెళ్తాం… ఐసోలేషన్ గడిపి, పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లేయర్లను ఇంటికి పంపిస్తాం…’ అని తెలియచేశారు కెనడా క్రికెట్ (సీసీ) ప్రెసిడెంట్ రాష్‌పాల్ భజ్వా.
ప్లేయర్లతో పాటు కెనడా టీమ్ మేనేజర్, మిగిలిన సిబ్బంది కూడా కరోనా పాజిటివ్ తేలినట్టు సమాచారం. ప్రస్తుతం ట్రినిడాడ్‌లో ఐసీసీ నిర్దేశించిన బయో బబుల్ ప్రొటోకాల్ ప్రకారం హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్న కెనడా జట్టు, ప్రత్యేక చార్టెట్ ఫ్లైట్‌లో స్వదేశానికి పయనం కానుంది. ఇండియా జట్టులోను కరోనా కల్లోలం గుబులు రేపుతుంది. టోర్నీ లీగ్ దశలో ఉండగా టీమిండియా కెప్టెన్ యష్ ధుల్ సహా వైస్ కెప్టెన్ షేక్ రషీద్, మరో నలుగురు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు భారత్ జంబో జట్టుతో ప్రపంచకప్ బరిలోకి దిగడంతో ఆటగాళ్ల కొరత ఏర్పడలేదు. ఈ దశలో ప్రధాన ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నా టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. గ్రూప్ 1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీ ఫైనల్1కి అర్హత సాధించాయి. టీమ్ 2 నుంచి ఆస్ట్రేలియా జట్టు సెమీ ఫైనల్ 2కి అర్హత సాధించగా… నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆస్ట్రేలియాతో తలబడనుంది…