Vaibhav Suryavanshi : అప్పుడు ఏడ్చుకుంటూ వెళ్లి.. ఇప్పుడూ సెంచరీతో.. వైభవ్ మాములోడు కాదు
ప్రధానాంశాలు:
Vaibhav Suryavanshi : అప్పుడు ఏడ్చుకుంటూ వెళ్లి.. ఇప్పుడూ సెంచరీతో.. వైభవ్ మాములోడు కాదు
Vaibhav Suryavanshi : 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గత rajasthan royals vs gujarat titans రాత్రి జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేయడమే కాక సిక్సర్లతో విధ్వంసం సృష్టించడమంటే ప్రపంచంలోనే 8వ వింత అనే చెప్పాలి..వైభవ్ చేసిన ఈ అద్భుత ప్రదర్శన వల్లే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తాజా మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి ఓవర్ మూడో బంతికి సిరాజ్ బౌలింగ్‌లో సిక్స్ బాది ఖాతా తెరిచిన వైభవ్.. నాలుగో ఓవర్లో తన అసలైన విశ్వరూపాన్ని బయటపెట్టాడు.

Vaibhav Suryavanshi : అప్పుడు ఏడ్చుకుంటూ వెళ్లి.. ఇప్పుడూ సెంచరీతో.. వైభవ్ మాములోడు కాదు
Vaibhav Suryavanshi కసితో బ్యాటింగ్..
ఇషాంత్ బౌలింగ్‌లో 6,6,4,0,6,4 బాదిన వైభవ్.. ఆ తర్వాతి ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. ఈ క్రమంలోనే వైభవ్ 17 బంతుల్లోనే తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో భారత్ తరఫున అత్యంత వేగంగా (35 బంతుల్లో) సెంచరీ చేసిన క్రికెటర్ గా నిలిచాడు.
వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో రాహుల్ ద్రావిడ్ నమ్మకాన్ని నిలబెట్టాడనే చెప్పాలి. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వైభవ్.. ఇప్పుడు 35 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసి అందరి చేత ఔరా అనిపించాడు. వైభవ్ ఐపీఎల్ లో తన తొలి మ్యాచును లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడి.. 20 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అరంగేట్ర మ్యాచులో ఆడిన తొలి బంతికే సిక్స్ బాది అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో స్టంప్ ఔట్ అయిన వైభవ్.. పెవిలియన్ చేరే సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లాడు. ఆ కసిని , సత్తాను తాజా మ్యాచ్‌లో చూపించి సెంచరీ బాదాడు.