Vaibhav Suryavanshi : ఐసీసీ ఇలా చేసిందేంటి.. వైభ‌వ్‌కి వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆడే ఛాన్స్ లేదా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vaibhav Suryavanshi : ఐసీసీ ఇలా చేసిందేంటి.. వైభ‌వ్‌కి వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆడే ఛాన్స్ లేదా ?

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Vaibhav Suryavanshi : ఐసీసీ ఇలా చేసిందేంటి.. వైభ‌వ్‌కి వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆడే ఛాన్స్ లేదా ?

Vaibhav Suryavanshi : ఇటీవ‌ల రాజ‌స్తాన్ తర‌పున సునామి ఇన్నింగ్స్ ఆడిన యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 14 సంవత్సరాల వ‌య‌స్సులో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గుజరాత్ జట్టుపై 35 బంతుల్లోనే అతను ఈ ఘనతను సాధించాడు. ఈ పవర్ ఫుల్ ఇన్నింగ్స్ తర్వాత, వైభవ్ సూర్యవంశీ త్వరలో టీం ఇండియా తరపున ఆడతాడ‌ని అంద‌రు అనుకున్నారు.

Vaibhav Suryavanshi ఐసీసీ ఇలా చేసిందేంటి వైభ‌వ్‌కి వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆడే ఛాన్స్ లేదా

Vaibhav Suryavanshi : ఐసీసీ ఇలా చేసిందేంటి.. వైభ‌వ్‌కి వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆడే ఛాన్స్ లేదా ?

Vaibhav Suryavanshi ఏడాది అంతేనా ?

కాని ఓ ఐసీసీ నియమం కారణంగా, అతను ప్రస్తుతానికి టీం ఇండియా తరపున ఆడటం కష్టంగా కనిపిస్తోంది. 2020 సంవత్సరంలో, ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ కోసం కనీస వయస్సు విధానాన్ని రూపొందించింది. ఈ విధానం ప్రకారం, అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనాలనుకునే ఏ ఆటగాడికైనా కనీసం 15 సంవత్సరాలు నిండి ఉండాలి. మరోవైపు, వైభవ్ సూర్యవంశీకి ప్రస్తుతం 14 సంవత్సరాలు మాత్రమే. వచ్చే ఏడాది మార్చి 27న అతనికి 15 ఏళ్లు నిండుతాయి.

దీనికి ముందు, అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి కనీస వయోపరిమితి లేని కార‌ణంగా పాకిస్తాన్‌కు చెందిన హసన్ రజా కేవలం 14 సంవత్సరాల 227 రోజుల వయసులో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇది ఇప్పటివరకు అతి పిన్న వయస్కుడైన రికార్డుగా నిలిచింది. అయితే ఐసీసీ పాలసీలో ఒక నిబంధన ఉంది. దీని కారణంగా వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్లలోపు కూడా టీం ఇండియా తరపున ఆడవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది