Virat Kohli : విరాట్ కోహ్లీ కోపం క‌ట్ట‌లు తెంచుకుంది.. అభిమానిపై విరుచుకుప‌డ్డ విరాట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : విరాట్ కోహ్లీ కోపం క‌ట్ట‌లు తెంచుకుంది.. అభిమానిపై విరుచుకుప‌డ్డ విరాట్

 Authored By sandeep | The Telugu News | Updated on :26 June 2022,9:00 pm

Virat Kohli : విరాట్ కోహ్లీకి కోపం వ‌స్తే ఏ రేంజ్‌లో ఉంటుందో మ‌నం చాలా సార్లు చూశాం. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌ర్య‌న‌లో ఉన్న ఆయ‌న ఓ అభిమానిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. లీసెస్టర్ టీమ్‌తో భారత టెస్టు జట్టు ప్రస్తుతం నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ కమలేశ్ నాగర్‌కోటి‌ని ఓ అభిమాని స్టాండ్స్‌లో నుంచి పదే పదే విసిగిస్తూ కనిపించాడు. ప్రాక్టీస్ సెషన్ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ ఇంగ్లాండ్ టూర్‌కి తీసుకెళ్లింది. ఈ క్రమంలో వార్మప్ మ్యాచ్‌లోనూ అతడ్ని ఆడించగా.. చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు.

అతడితో ఫొటో కోసం ఓ అభిమాని పదే పదే పిలుస్తూ విసిగించడం విరాట్ కోహ్లీకి కోపం తెప్పించింది. ఆ అభిమానికి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి.. కోహ్లీ, అభిమాని మధ్య వాగ్వాదాన్ని ఫోన్‌లో రికార్డు చేశాడు.కమలేష్ నాగర్‌కోటితో ఒక ఫోటో దిగాలనుకుంటున్నా. ఈ మ్యాచ్ చూడడానికి నేను ఆఫీసుకు సెలవు పెట్టా. అతడు నాతో ఒక్క సెల్ఫీ దిగితే ఏం పోతుంది. నేను అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నా’ అని కోహ్లీతో అన్నాడు. దాంతో కోహ్లీకి చిరువోత్తుకొచ్చింది. ‘అతను మ్యాచ్ ఆడటానికి వచ్చాడా? లేదా నీతో ఫోటోలు దిగడానికి వచ్చాడా?’ కోహ్లీ అనడంతో సదరు అభిమాని వెనక్కి తగ్గాడు.

Virat Kohli angry on england fan

Virat Kohli angry on england fan

Virat Kohli : కోహ్లీ ఫైర్

ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాన్స్ అందరూ ఆ అభిమానిపై మండిపడుతున్నారు.భారత్, ఇంగ్లాండ్ మధ్య జులై 1న టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ 79 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (18), శ్రేయాస్ అయ్యర్ (41) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 300 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 67 పరుగులు చేశాడు

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది