Virat Kohli vs Rohit Sharma : విరాట్ కోహ్లీ కెప్టెన్సీ vs రోహిత్ శర్మ కెప్టెన్సీ .. ఎవరు గొప్ప ఎవరు వీక్ .. కారణాలు !
Virat Kohli vs Rohit Sharma : రెండో టీ 20 వరల్డ్ కప్ కోసం భారతీయులు కన్న కలలు నిన్నటితో చెదిరిపోయాయి. 15 సంవత్సరాల నిరీక్షణ నిజం అవితుందని ఆశపడితే , నిరాశే మిగిలింది. ఆస్ట్రేలియా వేదికగా నిన్న జరిగిన టీ 20 వప్రల్డ్ కప్ 2022 లో టీం ఇండియా దారుణం గా ఓడిపోయింది. సెమిఫైనల్ లో ఇంగ్లాండ్ చేతి లో దారుణం గా 10 వికెట్ ల తేడతో పరాజయం పొందింది. సూపర్ 12 లో నాలుగు విజయలతో అధర కొట్టిన భారత్ ఇంగ్లాండ్ పై చిత్తు చిత్తు గా ఓడిపోయింది. ముఖ్యంగా టీమిండియా మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులైతే ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కోహ్లీకి ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అవుతుందని భావిస్తున్న తరుణంలో సెమీస్ వరకు వచ్చి.. ఓడిపోవడంతో ప్రపంచ కప్‌ను ముద్దాడకుండానే కోహ్లీ తన కెరీర్‌ను ముగిస్తాడేమో అనే ఆందోళన కోహ్లీ ఫ్యాన్స్‌లో మొదలైంది. ఇది ఇలా ఉండగా మరో ఆసక్తికరమైన విషయంపై ,ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. 2007లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వరల్డ్ కప్ ను సాధించింది. ఇక అప్పుడు టీమిండియా కు ధోని సారథ్యం వహించాడు.
ఆ తర్వాత నుండి ఇప్పటివరకు వరల్డ్ కప్ ను కొట్టలేదు. అయితే ధోని తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధితులను రన్ మిషన్ విరాట్ కోహ్లీ తీసుకున్నాడు. కోహ్లీ సారధ్యంలో టీమిండియా బాగానే రానించింది కానీ వరల్డ్ కప్ లాంటి మెగా ,ట్రోఫీ లను మాత్రం పొందలేకపోయింది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ను తప్పుపడుతూ కోహ్లీపై విమర్శలను పలువురు గుప్పించారు. టీమిండియా వరల్డ్ కప్ ను కొట్టక పోవడానికి కారణం కోహ్లీ అంటూ నోటికొచ్చిన విమర్శలు చేశారు. ఇక దీనికి ఐపీఎల్ ని కూడా ఉధాహరణగా చూపిస్తూ, ఐపీఎల్ లో కోహ్లీ సారథ్యంలో జరిగే ఆర్సిబి ఒకసారి కూడా కప్పు కొట్టలేదు. దేనికి కారణం కోహ్లీనే అంటూ చాలామంది వేలు ఎత్తి చూపించారు. విమర్శలు ఎవరైనా చేస్తారు కానీ జట్టు సారథ్యం వహించడం అంటే అంత తేలికైన విషయం కాదని వారికి తెలియదు. అయితే అదే సమయంలో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు రోహిత్ సారధ్యం వహిస్తూ ఐదుసార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. కోహ్లీ కెప్టెన్సీ వలన అటు ఆర్సీబీ ఇటు టీమిండియా దారుణంగా పరాజయ పాలవుతున్నాయని ట్రోలింగ్ చేశారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలను కోహ్లీ అంతగా పట్టించుకునే వాడు కాదు.
కాని బ్యాటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టేందుకు కెప్టెన్సీ భారాన్ని తగ్గించుకుని కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాడు. కెప్టెన్సీ బాధ్యతలు తొలగిన తర్వాత విరాట్ అసలు రూపం చూపించేశాడు. తిరిగి ఫామ్ లోకి వచ్చి రన్ మిషన్ అనిపించుకున్నాడు. అయితే కొత్త కోచ్ రాహుల్ ద్రావిడు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ , జోడిగా టి20 వరల్డ్ కప్ 2022 సాగింది. కానీ తీరా చూస్తే టీమిండియా వరల్డ్ కప్ సెమిస్ లోనే అతి దారుణంగా ఓడిపోయింది. ఇక అప్పుడు కోహ్లీ కెప్టెన్సీ ని తప్పు పట్టిన వారు దగ్గర ఇప్పుడు ఎలాంటి సమాధానం లేదని చెప్పాలి. కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో అందరికంటే తానే ఎక్కువ కష్టపడేవాడు. ఇక ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో కూడా అందరికంటే కోహ్లీనే ఎక్కువగా కష్టపడ్డాడు. టి20 వరల్డ్ కప్ 2021 లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా టీమిండియా టీం మొత్తం విఫలమైన సరే కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 151 పరుగులతో గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. ఇక తాను కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా , తాను టీమిండియా విజయం కోసం అంత కష్టమైన చేస్తాడని నిరూపించాడు. ఇక కోహ్లీని విమర్శించే వారికి ఇదొక మంచ జవాబు అని చెప్పాలి.