Virat Kohli : గ్రౌండ్‌లోకి దూసుకు వచ్చిన కోహ్లీ అభిమాని.. కోహ్లీ కాళ్లపై పడి…!
ప్రధానాంశాలు:
Virat Kohli : గ్రౌండ్‌లోకి దూసుకు వచ్చిన కోహ్లీ అభిమాని.. కోహ్లీ కాళ్లపై పడి...!
Virat Kohli : ఐపీఎల్ 2025ని గ్రాండ్ విక్టరీతో శుభారంభం చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తొలి మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్‌తో కలిసి విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. కోహ్లీ, ఫిల్ సాల్ట్ ద్వయం ఎంత విధ్వంసకరంగా ఆడిందంటే, వారిద్దరిని విడదీసేందుకు కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మ్యాచ్ నాలుగో ఓవర్‌లోనే వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపాడు.

Virat Kohli : గ్రౌండ్‌లోకి దూసుకు వచ్చిన కోహ్లీ అభిమాని.. కోహ్లీ కాళ్లపై పడి…!
Virat Kohli భద్రతా లోపం..
అయితే కోహ్లీ ఎక్కడా తగ్గలేదు. కొన్నిసెన్సేషనల్ షాట్స్ ఆడుతూ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 59 పరుగులతో చెలరేగాడు. అందులో స్లాగ్ స్వీప్ షాట్లు కూడా ఒకటి. దీనినే ప్రధానంగా ప్రత్యర్థి స్పిన్నర్లపై ఉపయోగించాడు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ పై ఈ షాట్లు బాదుతూ విరుచుకుపడ్డాడు. ఈ షాట్లే కోహ్లీ ఎక్కువ స్కోరు చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి.
అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని సడెన్‌గా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. రావడం రావడం కోహ్లీ కాళ్లపై పడ్డాడు. అనంతరం కోహ్లీని హగ్ చేసుకున్నాడు.ఈ సమయంలోనే భద్రతా సిబ్బంది గ్రౌండ్‌లోకి వచ్చి అతడిని తీసుకొని వెళ్లారు. అయితే ఈ ఘటనతో భద్రతా లోపం ఎంత ఉందనేది స్పష్టంగా అర్ధమవుతుంది.