Virat Kohli : వన్డేలకు విరాట్ కోహ్లీ గుడ్ బై..?.. ఆయన ప్లేస్‌లో ఎవరొస్తారో..
Virat Kohli : భారత క్రికెట్ జట్టులో సీనియర్లు ఇక జట్టుకు బై చెప్పే టైం అయింది. ఈ నేపథ్యంలోనే వారి స్థానాల్లో యువకులకు అవకాశాలు రానున్నాయి. ఇకపోతే నూతన యువకులు జట్టులో చేరడం ద్వారా టీమిండియా ఇంకా స్ట్రాంగ్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. మరో రెండు రోజుల్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాకు వెళ్లనుంది. అక్కడ మూడు టెస్ట్ సిరీస్‌లో భారత్ పాల్గొననుంది. ఇప్పటికే టెస్టుల అనంతరం తాను వన్డేలలో ఆడబోనని విరాట్ కోహ్లీ చెప్పాడు.విరాట్ కోహ్లీ వన్డేల్లో తప్పుకున్నట్లయితే ఆయన ప్లేస్‌లో ఎవరొస్తారనేది చర్చనీయాంశంగా ఉంది.
ఇకపోతే టెస్టు జట్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. గాయం వలన రోహిత్ టెస్టుకు దూరంగా ఉన్నాడు. ఇక ఈ కీలక టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే, టీమిండియాలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్న క్రికెటర్స్ అందుబాటులో ఉన్నారని మాజీ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అంటున్నాడు. ఈ నేపథ్యంలోనే దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న వాళ్లకు జట్టులో చాన్స్ ఇవ్వాల్సిన అవసరముందని దిలీప్ చెప్తున్నారు.దిలీప్ వెంగ్ సర్కార్ చెప్తున్న దాని ప్రకారం.. రుతురాజ్ గైక్వాడ్ టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్‌లో మూడో నెంబర్‌లో మంచిగా బ్యాటింగ్ చేయగలడని అంటున్నారు.
Virat Kohli : ఈ టెస్ట్ సిరీస్ కోహ్లీకి కీలకం..
అజింక్య రహానే, చతేశ్వర్ పుజార తదితరులు ఫామ్‌లో లేని సమయంలో ఇటువంటి వారికి చాన్స్ ఇవ్వాలని అంటున్నారు. ఈ క్రమంలోనే రుతురాజ్ టాలెంట్ గురించి చర్చ జరుగుతున్నది. ఇకపోతే రుతురాజ్ ఏజ్ ఇప్పటికే 24 ఏళ్లు దాటిందని, సో సీనియర్ జట్టులోకి ఆయన వస్తే బాగుంటుందని అంటున్నాడు. కోహ్లీపై భారం తగ్గాలంటే జట్టులోకి రుతురాజ్ రావాలని ఈ సమయంలో మరికొందరు సైతం అభిప్రాయపడుతున్నారు. విరాట్ లేని సమయంలో రుతురాజ్ గైక్వాడ్ రాణిస్తాడని అంటున్నారు. రుతురాజ్ ప్రజెంట్ మంచి పామ్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా నాలుగు సెంచరీలు చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ఆయనకు అవకాశం ఇవ్వాలని పలువురు అంటున్నారు. చూడాలి మరి.. ఏమవుతుందో…