Virat Kohli : మరి కొద్ది సేపట్లో పాక్‌తో మ్యాచ్.. విరాట్ కోహ్లీ ఆడేది అనుమానమే..!
ప్రధానాంశాలు:
Virat Kohli : మరి కొద్ది సేపట్లో పాక్‌తో మ్యాచ్.. విరాట్ కోహ్లీ ఆడేది అనుమానమే..!
Virat Kohli : ఛాంపియన్స్ ట్రోఫిలో Champions Trophy అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. నరాలు తెగే హై ఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరికి దక్కుతుంది. సెమీస్ అవకాశాలు ఎవరు మెరుగుపరచుకుంటారు అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సూపర్ ఫైట్‌కు ముందు టీమిండియాకు India షాక్ తగిలినట్టు తెలుస్తుంది. టీమిండియా స్టార్ ప్లేయర్‌కు గాయమైనట్టు సమాచారం.

Virat Kohli : మరి కొద్ది సేపట్లో పాక్‌తో మ్యాచ్.. విరాట్ కోహ్లీ ఆడేది అనుమానమే..!
Virat Kohli టెన్షన్ పెడుతున్న కోహ్లీ..
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ Virat Kohli కి గాయమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది.ప్రాక్టీస్ సెషన్‌లో కాలికి గాయం కావడంతో ఐస్ ప్యాక్‌తో రెస్ట్ తీసుకుంటూ కోహ్లీ కనిపించాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
కోహ్లీకి పాకిస్థాన్‌పై Pakistan మంచి సూపర్ రికార్డు ఉంది. అందుకే కోహ్లీ లేకపోతే టీమిండియా నష్టమంటున్నారు ఫ్యాన్స్. అయితే, ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.అయితే కోహ్లీ గైర్హాజరు అయితే అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం టీమిండియాలో రోహిత్, గిల్ Gil సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ మరోసారి రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు.