Virat Kohli : వాట్ ఏ థ్రిల్లింగ్ విక్టరీ.. ఒంటి చేత్తో గెలిపించిన విరాట్ కోహ్లీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : వాట్ ఏ థ్రిల్లింగ్ విక్టరీ.. ఒంటి చేత్తో గెలిపించిన విరాట్ కోహ్లీ

 Authored By sandeep | The Telugu News | Updated on :23 October 2022,5:50 pm

Virat Kohli : పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఏ రేంజ్‌లో కిక్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంత‌క‌న్నా ఎక్కువ కిక్ ఈ రోజు మ్యాచ్ తో వ‌చ్చింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని విధంగా ఈ మ్యాచ్ సాగ‌గా, విజ‌యం భార‌త్‌నే వ‌రించింది. కోహ్లీ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో తొలి విజ‌యం న‌మోదు చేసుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు.

ఇక మ్యాచ్ గెల‌వ‌డం క‌ష్ట‌మే అనుకున్న స‌మ‌యంలో విరాట్ కోహ్లీ (82 నాటౌట్) అద్భుతంగా పోరాడాడు. హార్దిక్ పాండ్యా (40) అండగా నిలబడటంతో రెచ్చిపోయిన కోహ్లీ.. అవసరమైన రన్‌రేట్ పెరిగిపోయిందని అనిపించిన ప్రతిసారీ బౌండరీలు బాదుతూ వచ్చాడు. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా కోహ్లీ, అశ్విన్ అద్భుతంగా ఓడి భార‌త్ కి విజ‌యాన్ని అందించారు. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్, మహమ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. నసీమ్ షా ఒక వికెట్ తీసుకున్నాడు. అక్టోబర్ 23 తేదిన విరాట్ రెండు భారీ ఇన్నింగ్స్ ఆడటం గమనార్హం.

Virat Kohli on india won the match

Virat Kohli on india won the match

Virat Kohli : వాట్ ఏ విన్నింగ్…

2011 అక్టోబర్ 23న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2015 అక్టోబర్ 22న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 138 పరుగులతో రాణించాడు. 2016 అక్టోబర్ 23న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 154 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2017 అక్టోబర్ 21న వెస్టిండీస్‌తో 140 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ మరుసటి రోజే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 121 పరుగులు చేశాడు. 2018 అక్టోబర్ 24న వెస్టిండీస్‌పై 157 పరుగులతో అజేయంగా నిలిచాడు.గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లంతా విఫలమైన వేళ విరాట్ కోహ్లీ ఒక్కడే 57 పరుగులతో రాణించి ఇజ్జత్ కాపాడాడు. మొత్తానికి ఆ సెంటిమెంట్ కొన‌సాగించాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది