Virat Kohli : జస్ట్ మిస్.. సచిన్ రికార్డును సమం చేయబోయి కొద్దిలో తడబడిన కోహ్లీ.. మళ్లీ సెంచరీ మిస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Virat Kohli : జస్ట్ మిస్.. సచిన్ రికార్డును సమం చేయబోయి కొద్దిలో తడబడిన కోహ్లీ.. మళ్లీ సెంచరీ మిస్

Virat Kohli : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ జస్ట్ లో అరుదైన రికార్డును క్రియేట్ చేయడం మిస్ అయ్యాడు. నిజానికి ఈ మ్యాచ్ లోనే ఓ రికార్డును క్రియేట్ చేశాడు. వన్డేల్లో ఒకే ఏడాదిలో వెయ్యి పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు సచిన్ పేరు మీద ఉన్న ఈ రికార్డును కోహ్లీ క్రాస్ చేశాడు. సచిన్ ఒక ఏడాదిలో 1000 […]

 Authored By kranthi | The Telugu News | Updated on :2 November 2023,5:26 pm

ప్రధానాంశాలు:

  •  1000 పరుగులు సాధించి సచిన్ రికార్డ్ బ్రేక్

  •  జస్ట్ లో 49వ సెంచరీ మిస్

  •  శ్రీలంక మ్యాచ్ లో కోహ్లీ రికార్డు

Virat Kohli : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ జస్ట్ లో అరుదైన రికార్డును క్రియేట్ చేయడం మిస్ అయ్యాడు. నిజానికి ఈ మ్యాచ్ లోనే ఓ రికార్డును క్రియేట్ చేశాడు. వన్డేల్లో ఒకే ఏడాదిలో వెయ్యి పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు సచిన్ పేరు మీద ఉన్న ఈ రికార్డును కోహ్లీ క్రాస్ చేశాడు. సచిన్ ఒక ఏడాదిలో 1000 పరుగులను ఏడు సార్లు చేశాడు. కానీ.. విరాట్ కోహ్లీ మాత్రం 8 సార్లు చేసి టాప్ ప్లేస్ లోకి వెళ్లాడు. దానితో పాటు వన్డేల్లో 49వ సెంచరీ చేయబోయి విరాట్ కోహ్లీ జస్ట్ మిస్ అయ్యాడు. 49వ సెంచరీ చేసి ఉంటే.. సచిన్ రికార్డును కూడా కోహ్లీ సమం చేసి ఉండేవాడు. కానీ జస్ట్ లో సెంచరీ మిస్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఇప్పటి వరకు సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. ఇప్పటి వరకు విరాట్ వన్డేల్లో 48 సెంచరీలు చేశాడు. ఒకవేళ ఇవాళ్టి మ్యాచ్ లో విరాట్ 49 సెంచరీలు చేసి ఉంటే.. సచిన్ రికార్డును సమం చేసి ఉండేవాడు.

94 బంతుల్లో 88 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. మదుషంక బౌలింగ్ లో నిస్సాంకకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 11 ఫోర్లు కొట్టాడు. కానీ.. సిక్స్ ఒక్కటి కూడా కొట్టలేదు. ఇక..ఈ మ్యాచ్ తో సహా 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019 సంవత్సరాల్లో వన్డే మ్యాచ్ లలో వెయ్యికి పైగా పరుగులను కోహ్లీ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ ఇప్పటి వరకు 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. ఇప్పటి వరకు 43 ఓవర్లు పూర్తయ్యాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది