Virat Kohli : జట్టులో చోటు లభించేనా.. విరాట్ కోహ్లీకి పొంచిన ముప్పు..!
Virat Kohli : టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశాడు. వన్డే, టీ20ల కెప్టెన్సీ నుంచి ఆల్రెడీ తప్పుకున్న విరాట్ కోహ్లీ తాజాగా టెస్టు కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు. అయితే, కోహ్లీ ఇంత త్వరగా టెస్ట్ కెప్టెన్సీ వదులుకుంటాడని ఎవరూ ఊహించలేదు. కానీ, అనూహ్య నిర్ణయం తీసుకుని కోహ్లీ అందరినీ ఆశ్చర్యంలో పడేశాడు.ఇకపోతే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న నేపథ్యంలో ఆయనకు ముంపు పొంచినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్సీ నుంచి వైదొలగే ముందు విరాట్ కోహ్లీ బీసీసీఐని సంప్రదించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా విరాట్ కోహ్లికి బోర్డుకు మధ్య వాగ్వాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ క్రమంలోనే తాజాగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇకపోతే టెస్టు క్రికెట్‌లో పుజారా, రహానేల పేలవ ప్రదర్శన వలన విరాట్ కోహ్లీకి ఇబ్బందులొచ్చాయని వార్తలొస్తున్నాయి. అయితే, కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన క్రమంలో బీసీసీఐ ఆమోదం తెలపడంతో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తన బాధ్యతలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించాడని కొనియాడింది.కోహ్లీకి ఇక ముప్పు పొంచి ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనకు జట్టులో చోటు కల్పించడంపైన కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Virat Kohli : కోహ్లీ ఇతర ఆటగాళ్లతో సమానమా..!
విరాట్ కోహ్లి, బీసీసీఐ మధ్య గొడవ సద్దుమణగలేదు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో విరాట్ కోహ్లీ పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుందా అని కొందరు అడుగుతున్నారు కూడా. ఒకవేళ విరాట్ కోహ్లీ పరుగులు సరైన రీతిలో పరుగులు చేయకపోతే ఆయనకు జట్టులో స్థానం ఇతర ఆటగాళ్లతో సమానంగా ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో మరి.. విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా పుజారా, రహానేలే చేశారని మరో వైపున కథనాలు కూడా వస్తున్నాయి. కోహ్లీ ఈ సందర్భంలో వారిరువురిపైన అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.