Virat Kohli : బీసీసీఐకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. ODI కెప్టెన్సీ నుంచి తప్పించినందుకు దెబ్బకు దెబ్బ తీశాడంటున్న ఫ్యాన్స్!
Virat Kohli : టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐకు గట్టి షాక్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్ ఆడటం లేదని ప్రకటించాడు.టెస్టు మ్యాచుకు అందుబాటులో ఉంటానని, వన్డేకు మాత్రం ఉండబోనని ఖరాఖండీగా చెప్పినట్టు తెలుస్తోంది. కారణం విరాట్‌ను నిర్దాక్షిణ్యంగా వన్డే క్రికెట్‌కు కెప్టెన్‌గా తొలగించడమే అని అభిమానులు చెబుతున్నారు.టీ20 మరియు వన్డే జట్టుకు కెప్టెన్‌గా నియమితులైన రోహిత్ శర్మ ప్రస్తుతం గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు మరియు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో బీసీసీఐ సెలెక్టర్ల కమిటీ విరాట్‌కు కాల్ చేయగా మనోడు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. చివరగా అందుబాటులోకి వచ్చిన కోహ్లీ..
బీసీసీఐకు షాక్ ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికా టూర్ కోసం ఆటగాళ్లు అందరూ ముంబైలోని హోటల్లో ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే కోహ్లీ తాను మంగళవారం టీం ఇండియాతో కలుస్తానని బీసీసీఐ అధికారులకు చెప్పాడు. కానీ దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు మాత్రమే తాను అందుబాటులో ఉంటానని.. వన్డే సిరీస్‌కు మాత్రం రానని తెగేసి చెప్పాడని తెలిసింది. వ్యక్తిగత కారణాల వలన తాను వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనని కోహ్లీ చెప్పగా.. బీసీసీఐ అధికారులు మాత్రం కోహ్లీ తనను వన్డే క్రికెట్ కెప్టెన్‌గా తొలగించడం వల్లే అలకబూని రానాన్నడని నిర్దారణకు వచ్చారు.
Virat Kohli : కూతురి పుట్టిన రోజు అసలు కారణం కదా..
వాస్తవానికి కోహ్లీ కూతురు ‘వామిక’ తొలి బర్త్ డే జనవరి 11వ తేది.. తన కూతురు పుట్టిన రోజు కారణంగా వన్డే సిరీస్‌కు రానని కోహ్లీ బీసీసీఐ సెలెక్టర్లకు చెప్పాడు. కానీ ఇది వ్యాలిడ్ రీజన్ కాదని సెలెక్టర్లు చెబుతున్నారు. ఎలాగంటే కోహ్లీ కూతురు పుట్టిన రోజు జనవరి 11వ తేది. అదే రోజు సౌత్ ఆఫ్రికాతో విరాట్ మూడో టెస్టు ఆడుతాడు. అది 15న ముగుస్తుంది. అప్పటికీ విరాట్ కూతురు బర్త్ డే అయిపోతుంది. టెస్టు సిరీస్ తర్వాత ప్రారంభమయ్యే వన్డేకు కోహ్లీ ఎందుకు అందుబాటులో ఉండనని చెప్పాడు. బర్త్ డే అప్పటికే అయిపోతుంది కదా.. అయిపోయాక విరాట్ ఏం చేస్తాడు అని బీసీసీఐ అడుగుతోంది. కావాలనే విరాట్ అలకబూని రావడం లేదని సెలెక్టర్లు నిర్దారణకు వచ్చినట్టు తెలిసింది.