Virat Kohli Steps Down: బ్రేకింగ్..టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై.. విరాట్ కోహ్లీ కీలక ప్రకటన..
Virat Kohli Steps Down: టీమిండియా ఆటగాడు సంక్రాంతి పర్వదినాన కీలక ప్రకటన చేశాడు. తాను టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. పోస్టులో తను తప్పుకోవడానికి గల కారణాలు వివరంగానే తెలిపాడు.ట్విట్టర్ వేదికగా పెట్టిన సదరు పోస్టులో విరాట్ కోహ్లీ స్పష్టంగానే వివరణ ఇచ్చాడు. తాను ఏడేళ్లుగా ఎన్నో ఒడిదొడుకులు చూశానని
, ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు అని తెలిపాడు.ఇటీవల టీ20, వన్డే కెప్టెన్సీల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రజెంట్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ పగ్గాలను కూడా వదులుకున్నాడు.

virat kohli steps down as indias test captain twitter post
Virat Kohli Steps Down: ఇటీవల టీ ట్వంటీ, వన్డేల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్..
ఇకపోతే తాను ఇప్పటి వరకు తన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించానని, ప్రతీది జీవితంలో దాని సందర్భంలో రావాల్సిన క్రమంలో వస్తుందని ఈ సందర్భంగా కోహ్లీ చెప్పాడు. తను కెప్టెన్సీ నిర్వర్తించే క్రమంలోనే తనకు అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయని, అన్నిటినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగినట్లు పేర్కొన్నాడు.
???????? pic.twitter.com/huBL6zZ7fZ
— Virat Kohli (@imVkohli) January 15, 2022