Virat Kohli : ఒంటిచేత్తో క్యాచ్ పట్టి… అనుష్కకి ఇలా చూపిస్తూ.. విరాట్ కోహ్లీ దొరికిపోయాడు
Virat Kohli : ఢిల్లీ క్యాపిటల్స్ తో శనివారం రాత్రి జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. 16 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దిల్లీ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు జట్టులో దినేశ్ కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్‌తో మరోసారి సత్తా చాటాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడిన దినేశ్ కార్తిక్.. ముస్తాఫిజుర్ రహ్మాన్ వేసిన 18వ ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. ఏకంగా నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు బాది.. ఒకే ఓవర్లో 28 పరుగులు రాబట్టాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఫీల్డింగ్‌లో అదరగొట్టేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం రాత్రి వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో.. రిషబ్ పంత్ కొట్టిన బంతిని గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌గా అందుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఒత్తిడికి గురైన ఢిల్లీ క్యాపిటల్స్.. చివరికి 16 పరుగుల తేడాతో బెంగళూరు చేతిలో ఓడిపోయింది.ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లు ముగిసే సమయానికి 134/5తో నిలిచింది. ఈ దశలో ఇన్నింగ్స్ 17వ ఓవర్‌ని మహ్మద్ సిరాజ్ వేయగా.. మొదటి బంతికి రెండు పరుగులు చేసిన రిషబ్ పంత్.. రెండో బంతికి సిక్సర్ బాదేశాడు. దాంతో.. 24 బంతుల్లో 56 పరుగులుగా ఉన్న సమీకరణం.. 22 బంతుల్లో 48 పరుగులుగా మారిపోవడంతో.. బెంగళూరు టీమ్‌లో కాస్త కంగారు పడింది.
Virat Kohli : అనుష్కకు విక్టరీ సింబల్
ఒత్తిడికి గురైన సిరాజ్ మూడో బంతినిలో ఫుల్ టాస్ రూపంలో విసరగా.. రిషబ్ పంత్ కవర్స్ దిశగా విరాట్ కోహ్లీ తలపై నుంచి బౌండరీ కోసం బంతిని హిట్ చేశాడు.గంటకి 137కిమీ వేగంతో వచ్చిన ఆ బంతిని రిషబ్ పంత్ చక్కగా కనెక్ట్ చేయడంతో.. కోహ్లీ తలపై నుంచి బంతి బౌండరీకి వెళ్లేలా కనిపించింది. కానీ.. గాల్లోకి ఎగిరిన విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. దాంతో పంత్ నమ్మలేనట్లు చూసి.. నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. కోహ్లీ మాత్రం ఆ క్యాచ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. స్టేడియంలోని గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్న అనుష్క శర్మ వైపు విక్టరీ సింబల్ చూపిస్తూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. అనుష్క కూడా ఫుల్ హ్యాపీగా ఫీలవడం కనిపించింది.
Virat Kohli given winning sign to his Anushka Sharma when he takes a Outstanding catch. pic.twitter.com/CSkadeXgWG
— CricketMAN2 (@ImTanujSingh) April 16, 2022