India vs Pakistan : ఇండియాతో మ్యాచ్ ఓడిన తర్వాత పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందంటే.. వీడియో..!
India vs Pakistan : ఇండియా- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకి ఎంత మజా అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించారు. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఆట తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాలా టైట్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ చాలా అద్భుతమైన ప్రదర్శన కనిపించాడు. చివరి ఓవర్లో 16 పరుగులు కావాల్సి ఉండగా బంతి బంతికి ఉత్కంఠ మధ్య సాగిన ఓవర్లో భారత్ నే విజయం వరించింది. 160 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రోహిత్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ అవుటైనా.. హార్దిక్ పాండ్యాతో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు కోహ్లీ.
చిరకాల ప్రత్యర్థిపై భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఓడిపోవడంతో కుంగిపోయారు. మ్యాచ్ తర్వాత వారి డ్రెస్సింగ్ రూమ్ నిశ్శబ్దంగా మారిపోయింది. ఆటగాళ్లంతా తలపట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో పాక్ బ్యాటింగ్ కోచ్ మ్యాథ్యూ హేడెన్ పాక్ ఆటగాళ్లను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అలాగే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఆటగాళ్లతో మాట్లాడుతూ.. వారిని సాదారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్ని చేశాడు. . మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ.. అతను కూడా కొంత భావోద్వేగానికి గురయ్యాడు. చూడండి.. మ్యాచ్‌లో మనం మంచి ప్రదర్శన చేశాం. కొన్ని తప్పులు కూడా చేశాం. అవి సరి చేసుకొని ముందుకు వెళదాం. ఇది మనకు ఫస్ట్ మ్యాచ్ .ఇంకా ఎన్నొ మ్యాచ్‌లు మనం ఆడాల్సి ఉంది.
India vs Pakistan : ఓదార్చిన కెప్టెన్..!
ఒక్కరి వలన మనం ఓడిపోలేదు. మనం జట్టుగానే ఓడాం.. జట్టుగానే గెలుస్తాం. మనం టీమ్‌గా చాలా బాగా ఆడాం. దాన్నే కొనసాగిద్దాం. మ్యాచ్ ఓడిపోయినా.. కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు చూశాం. వాటిని నుంచి స్ఫూర్తి పొందండి.’ అని బాబర్ అన్నాడు. చివరి ఓవర్ వేసిన నవాజ్‌ని ఓదారుస్తూ ‘నవాజ్ నువ్వేమి దిగులు చెందకు.. నువ్వు నా మ్యాచ్ విన్నర్.. నీ పట్ల నాకెప్పుడు నమ్మకం ఉంటుంది.’ అని చెప్పాడు. ఇక మెల్బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ నరాలు తెగేంతగా ఉత్కంఠగా కొనసాగింది. ఈ పోరులో 160 పరుగుల టార్గెట్ ను 20 ఓవర్లలో అందుకుంది భారత్. నాలుగు వికెట్ల తేడాతో గెలిచి టీ20 ప్రపంచకప్ లో బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ మ్యాచ్‌ని మలుపు తిప్పడమే కాకుండా 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి నాటౌట్‌గా నిలిచారు.