Cricket Pitch : ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ చూశారా? బ్యాట్స్ మెన్ బ్యాట్ తో ఎందుకు పిచ్ ను టచ్ చేస్తాడో తెలుసా?
Cricket Pitch : క్రికెట్ ఆట గురించి భారతీయులకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. మన దేశంలో ఉన్నంత క్రికెట్ క్రేజ్ మరే దేశంలో లేదు. క్రికెట్ ఆట అంటే చాలు.. మన దేశంలో చాలా మంది అభిమానులు ఉంటారు. మరే ఆటకు కూడా మన దేశంలో ఇంత క్రేజ్ లేదు కానీ.. ఒక క్రికెట్ కే ఉంది. అందుకే.. టీమిండియా కూడా ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ క్రికెట్ టీమ్ గా చరిత్ర సృష్టించింది.అయితే.. కోట్లాది మంది ఆరాధించే క్రికెట్ లో జరిగే కొన్ని విషయాలు చాలామందికి తెలియదు. మ్యాచ్ జరిగే సమయంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి కానీ..
సగటు క్రికెట్ అభిమాని మాత్రం తన దృష్టి మొత్తం ఎప్పుడూ బౌలింగ్, బ్యాటింగ్ మీదే పెడుతుంటాడు.అయితే.. క్రికెట్ ఆడేసమయంలో బ్యాట్స్ మెన్ ఒక పని చేస్తాడు. తన బ్యాట్ తో పిచ్ ను అక్కడా ఇక్కడా తాకుతుంటాడు. అది మీరు ఎప్పుడైనా గమనించారా? పిచ్ మధ్యలోకి వెళ్లి కూడా అలా చేస్తూ ఉంటాడు. దానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఎందుకు బ్యాట్ తో పిచ్ మీద ఒక బ్యాట్స్ మెన్ అలా చేస్తాడో తెలుసా?పిచ్ మీద ఏవైనా ప్యాచ్ లు ఉన్నాయా అని ముందు బ్యాట్స్ మెన్ చెక్ చేస్తాడు.ఆ తర్వాత ఎక్కడైనా ప్యాచ్ సరిగ్గా లేదా..
Cricket Pitch : బ్యాట్స్ మెన్ పిచ్ ను బ్యాట్ తో తగిలించడానికి అసలు కారణం ఇదే
పైకి కిందికి ఉన్నాయా అని చెక్ బ్యాట్ తో చెక్ చేస్తాడు. ఒకవేళ అలా ఉంటే.. పిచ్ ను బ్యాట్స్ మెన్.. తన బ్యాట్ తో కిందికి కొట్టి సెట్ చేస్తాడు.అయితే.. మరికొందరు బ్యాట్స్ మెన్స్ మాత్రం అలా పిచ్ మధ్యలో బ్యాట్ తో కొట్టడాన్ని ఒక టెక్నిక్ గా వాడుతారట. పదే పదే.. పిచ్ మధ్యలోకి వచ్చి.. పిచ్ ను బ్యాట్ తో తడుముతుండటం వల్ల.. బౌలర్ ఏకాగ్రత దెబ్బతిని.. బౌలింగ్ సరిగ్గా పడదట.మరికొందరు బ్యాట్స్ మెన్ మాత్రం టెన్షన్ తో అలా చేస్తారు అని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా.. ఇలా పిచ్ మధ్యలో బ్యాట్ తో కింద కొట్టడాన్ని.. క్రికెట్ గార్డెనింగ్(cricket gardening) అంటారు.