Chennai Super Kings : తమ టీమ్‌లోకి మరో చిచ్చరపిడుగుని తీసుకున్న సీఎస్కే.. రాత మారుతుందా?
ప్రధానాంశాలు:
Chennai Super Kings : తమ టీమ్‌లోకి మరో చిచ్చరపిడుగుని తీసుకున్న సీఎస్కే.. రాత మారుతుందా?
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 20న తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు గాయపడిన గుజర్ప్రీత్ సింగ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌ను తమ జట్టులోకి తీసుకుంది. బ్రెవిస్‌కు రూ.2.2 కోట్లు చెల్లించింది.

Chennai Super Kings : తమ టీమ్‌లోకి మరో చిచ్చరపిడుగుని తీసుకున్న సీఎస్కే.. రాత మారుతుందా?
Chennai Super Kings ఎవరు ఈ డైనమైట్..
దక్షిణాఫ్రికాకు చెందిన బ్రెవిస్ ఆటతీరు లెజెండ్ ఏబీ డివిలియర్స్‌ను పోలి ఉంటుంది. దీంతో అతడిని “బేబీ ఎబీ” అని ముద్దుగా పిలుచుకుంటారు. 2022 అండర్-19 ప్రపంచకప్‌లో తన విధ్వంసకర ఆటతీరు ద్వారా వెలుగులోకి వచ్చాడు. మూడు సీజన్ల పాటు MI జట్టులో కొనసాగిన బ్రెవిస్.. 2022లో ఏడు, 2024లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 230 పరుగులు చేసినా, వాటిల్లో హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు.
లెగ్ స్పిన్నర్‌గా తొలి బంతికే వికెట్ తీసిన అరుదైన 14 మంది ఆటగాళ్లలో బ్రెవిస్ ఒకడు. ఇటీవలి SA20 సీజన్‌లో బ్రెవిస్ మళ్లీ మెరిశాడు. 12 మ్యాచ్‌ల్లో 291 పరుగులతో పాటు 25 సిక్సర్లు కొట్టి అత్యధిక స్ట్రైక్‌రేట్ (184.25) నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు 81 T20 మ్యాచ్ ల్లో 1,787 పరుగులు చేసి, సగటుగా 26.27, స్ట్రైక్‌రేట్ 144.93తో నిలిచాడు. అదనంగా 18 వికెట్లు కూడా తీసుకున్నాడు. అంత రాణించిన దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు.