Ravindra Jadeja : నేను కెప్టెన్సీ చేయలేనంటూ పగ్గాలు ఎంఎస్ ధోనికి ఇచ్చిన రవీంద్ర జడేజా
Ravindra Jadeja : ఐపీఎల్ 2022 లో ముంబైతో పాటు చెన్నై టీం చెత్త పర్‌ఫార్మెన్స్ కనబరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో ధోనికి బదులు జడేజా కెప్టెన్సీ కిరీటాన్ని అందుకోగా, ఆయన బ్యాటింగ్‌లో పెద్దగా ప్రతిభ చూపించడం లేదు. అంతేకాకుండా టీం వరుస పరాజయాలు చవిచూస్తుంది. ఈ క్రమంలో జార్ఖండ్ డైనమెట్ MS ధోనీకి CSK కెప్టెన్సీని తిరిగి అప్పగిస్తు రవీంద్ర జడేజా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జడేజా తన ఆటపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎస్‌కే తన ట్విటర్‌లో ప్రకటించింది. దీంతో సీఎస్‌కే ఆడనున్న మిగతా మ్యాచ్‌లకు ధోని కెప్టెన్సీ వహించనున్నాడు.
ఇక సీజన్‌లో సీఎస్‌కే 8 మ్యాచ్‌లాడి రెండు గెలిచి.. ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ అవకాశాలు కష్టమే అయినప్పటికి ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్ గెలిస్తే సీఎస్‌కేకు అవకాశం ఉంటుంది. మరి గతంలో ధోని నాయకత్వంలోనే సీఎస్‌కే నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.కాగా సీజన్ ఆరంభానికి ముందే ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడంతో జడేజాను కెప్టెన్‌గా నియమించారు. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత ఫోకస్ పెట్టేందుకు రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు.
Ravindra Jadeja : జడ్డూ బైబై…
కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాలని మహేంద్ర సింగ్ ధోనీని కోరగా.. టీమ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతను అంగీకరించాడు.’అని చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్రకటనలో పేర్కొంది. కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన అతను వ్యక్తిగతంగా కూడా దారుణంగా విఫలమయ్యాడు. లీగ్‌కు ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న అతను.. కెప్టెన్సీ కారణంగా ఒక్క విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపరుచుకునేందుకు సారథ్య బాధ్యతలను వదిలేసాడు. తదుపరి అన్ని CSK మ్యాచ్ లకు ధోనినే కెప్టెన్ గా ఉంటారని యజమాన్యం ప్రకటించింది.