ICC World Cup 2023 : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023.. స్వదేశంలో జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్ భారత్ ఆడకుండా ఉంటుందా..!
ICC World Cup 2023 : ప్రపంచ క్రికెట్లోని శక్తివంతమైన బోర్డు బీసీసీఐ కాగా, ఈ భూమ్మీద ఏ క్రికెట్ బోర్డుకు లేనన్ని ఆర్థిక వనరులు బీసీసీఐ సొంతం. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో.. క్రికెట్‌ను మతంలా భావించే గడ్డ మీద ఆటగాళ్లకు కొరత లేదనే చెప్పాలి.. ఇక, క్రికెట్ లో బీసీసీఐని ఎదురించే దమ్ము ఐసీసీ కూడా లేదన్నది నిజం. దాదాపు ఐసీసీకి వచ్చే నిధులన్నీ 90 శాతం మన క్రికెట్ బోర్డు నుంచే వస్తాయి అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహణ విషయమై ఇప్పటికే
బీసీసీఐ, ఐసీసీ మధ్య వివాదం ప్రారంభమైంది. అలాగే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌తో కూడా బీసీసీఐకి భేదాభిప్రాయాలు తలెత్తాయి… వచ్చే ఏడాది క్రికెట్ కి సంబంధించి రెండు మెగా టోర్నీలు జరగాల్సి ఉండగా, వీటిలో ఒకటైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంకో మెగా టోర్నీకి ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తుంది.అయితే, పాక్‌లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము ఆడమని ఇండియా తరఫున బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ICC World Cup 2023 : ఏం జరుగుతుంది..!
ఇలా చేస్తే తాము ఐసీసీ వన్డే వరల్డ్ కప్ నుంచి వాకౌట్ అవుతామని పాక్ హెచ్చరికలు జారీ చేసింది.అయితే ఏ టీం ఏ ట్రోఫీ నుంచి తప్పుకున్న నిర్వహణ బోర్డులకు, ఐసీసీకి చిక్కులు తప్పవనే చెప్పాలి. ఈ క్రమంలో ఇదే అంశంపై బీసీసీఐతో ఏసీసీ, ఐసీసీ చర్చలు కొనసాగిస్తోంది. ఈ చర్చలు సఫలమై వివాదం పరిష్కారం అయితేనే ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహించడం కుదురుతుందని చెప్పాలి. మరోవైపు పన్నుల అంశం కూడా టోర్నీ నిర్వహణకు పెద్ద సమస్యగా మారింది. భారతదేశంలో ఐసీసీ పన్ను చెల్లించుకోవాల్సిన అవసరం కూడా రాగా, పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ ఐసీసీ
బీసీసీఐని కోరింది కానీ ఈ విషయంలోతాము ఏమీ చేయలేమని బీసీసీఐ వెల్లడించడంతో ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారింది. పన్ను కట్టకూడదనుకుంటే ఇండియాలో కాకుండా వేరే దేశంలో టోర్నీ నిర్వహించుకోవచ్చని బీసీసీఐ.. ఐసీసీకి కూడా తెలిపినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో 2016లో నిర్వహించిన టీ20 ప్రపంచకప్ టోర్నీ సందర్భంగా పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించిన విషయం మనందరికి తెలిసిందే. . దీంతో బీసీసీఐకి రావాల్సిన వాటిలో, పన్నుగా చెల్లించిన రూ.190 కోట్లను తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది ఐసీసీ.