Cricket : క్రికెట్ చరిత్రలోనే ఇంత చెత్త ఫీల్డింగ్ చూసుండరు.. ఒక బంతికి 4 పరుగులు తీశారు
Cricket : క్రికెట్ ఆటగాళ్లు ఎప్పుడు తమ గేమ్ మీద దృష్టి సారించాలి. ఏం కాదులే మెల్లిగా ఆడుదాం.. మెల్లిగా పరిగెత్తుదాం అనుకుంటే అవతలి వారు మనల్నిదాటేసి వెళ్లిపోతారు. ఎందుకంటే క్రికెట్‌లో ప్రతిక్షణం, ప్రతి పరుగు చాలా కీలకం. మైదానంలో ఉండే ప్లేయర్లు ఎప్పుడు బంతిని గమనిస్తూనే ఉండాలి. అది బ్యాటర్, ఫీల్డర్, బౌలర్ ఎవరైనా సరే. బంతిని ఎటు వెళ్తుంది. ఎంత స్పీడుతో వస్తుంది గమనించడం కీలకం. Cricket : ఒక్క పరుగు రావాల్సిన చోట […]
Cricket : క్రికెట్ ఆటగాళ్లు ఎప్పుడు తమ గేమ్ మీద దృష్టి సారించాలి. ఏం కాదులే మెల్లిగా ఆడుదాం.. మెల్లిగా పరిగెత్తుదాం అనుకుంటే అవతలి వారు మనల్నిదాటేసి వెళ్లిపోతారు. ఎందుకంటే క్రికెట్‌లో ప్రతిక్షణం, ప్రతి పరుగు చాలా కీలకం. మైదానంలో ఉండే ప్లేయర్లు ఎప్పుడు బంతిని గమనిస్తూనే ఉండాలి. అది బ్యాటర్, ఫీల్డర్, బౌలర్ ఎవరైనా సరే. బంతిని ఎటు వెళ్తుంది. ఎంత స్పీడుతో వస్తుంది గమనించడం కీలకం.
Cricket : ఒక్క పరుగు రావాల్సిన చోట నాలుగిచ్చారు.
క్రికెటర్లు తమ ఫిట్నెస్ విషయంలో ఎప్పుడు దృష్టి సారించాలి. లేదంటే వారు జట్టులోకి ఎంపిక అవ్వడం చాలా కష్టం. ఒక్కొక్కరు జాతీయ జట్టులో స్థానం సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. అలాంటిది ఆటసందర్భంగా కేర్ లెస్‌గా ఉన్నా శిక్ష అనుభవించక తప్పదు. తాజాగా ఓ మ్యాచ్ లో జరిగిన సన్నివేశం చూస్తే ముందు నవ్వు రాక మానదు. బంగ్లాదేశ్ క్రికెటర్ల బద్దకానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. ఆ జట్టు ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో చేసిన పొరపాటు వలన తగిన మూల్యం చెల్లించుకున్నారు. భారీ పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయారు.‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్’లో భాగంగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి.
ఇందులో శ్రీలంక లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఇందులో శ్రీలంక లెజెండ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దిల్షాన్ ఆల్ రౌండర్ ప్రదర్శన చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీనికి బంగ్లాదేశ్ ఫీల్డర్ బద్దకమే కారణం అని కూడా అంటున్నారు కొందరు. బంతి దొరికిన వెంటనే విసరకుండా పట్టుకుని అలాగే నిలబడ్డాడు. ఆ తర్వాత విసిరినా కీపర్కు వేయకుండా ఎటో విసిరాడు. దీంతో ఒక పరుగు రావాల్సిన చోట నాలుగు పరుగులు వచ్చాయి.ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా..వరస్ట్ ఫీల్డింగ్ అంటే ఇదే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Oh they ran four ???? TM Dilshan & Mahela Udawatte during the legends game vs Bangladesh pic.twitter.com/GQbcOilJ1n
— Nibraz Ramzan (@nibraz88cricket) September 28, 2022