RCB : ఆ ముగ్గురిని మార్చండి బాబోయ్.. ఆర్సీబీకి వాళ్లే దరిద్రం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RCB : ఆ ముగ్గురిని మార్చండి బాబోయ్.. ఆర్సీబీకి వాళ్లే దరిద్రం..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 April 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  RCB : ఆ ముగ్గురిని మార్చండి బాబోయ్.. ఆర్సీబీకి వాళ్లే దరిద్రం..!

RCB  : ఆర్సీబీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఈ సీజన్ లో మూడో ఓటమిని కూడా మూటగట్టుకుంది ఆర్సీబీ టీమ్. దాంతో ప్లేయర్ల ఆటతీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇకతాజాగా హోం గ్రౌండ్ లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఆర్సీబీ దారుణంగా ఓటమి పాలు అయింది. అంతకు ముందు శుక్రవారం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమిపాలైంది. కేకేఆర్ తో మ్యాచ్ లో కోహ్లీ ఒక్కడే పోరాడాడు. అతనొక్కడే దాదాపు 83 పరుగులు చేసినా సరే మిగతా బ్యాటర్స్ నుంచి సరైన సపోర్ట్ రాలేదు.

దాంతో అతి కష్టం మీద 182 పరుగులు చేసింది. కనీసం ఈ స్కోర్ ను కూడా ఆర్సీబీ కాపాడుకోలేకపోయింది. బౌలింగ్ తేలిపోయింది. ఏ మాత్రం పటిష్టంగా వేయలేకపోయారు బౌలర్లు. దాంతో కేకేఆర్ ఓపెనర్లు దుమ్ము లేపారు. కేవలం 16.5 ఓవర్లలోనే ఆ టార్గెట్‌ను ఊదిపారేసింది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌, సునీల్‌ నరైన్‌ ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇక వారి తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ కూడా దుమ్ములేపడంతో ఆర్సీబీ చిత్తుగా ఓడిపోయింది. ఇక తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ఈ మ్యాచ్ లను చూసిన అభిమానులు ఓ ముగ్గురిని ఆర్సీబీకి పట్టిన దరిద్రం అని అంటున్నారు. ఆ ముగ్గురిని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అందులో ఒకరు రజత్ పాటిదార్. ఇతను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. అతని ప్లేస్ లో సర్పరాజ్ ఖాన్ ను తీసుకున్నా బాగుండేదని అంటున్నారు. ఇక ఆర్సీబీ బౌలింగ్‌ అయితే మరీ చెత్తగా ఉంది. అందులోనూ మెయిన్ బౌలర్ సిరాజ్ అయితే ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. అతను వెంటనే ఫామ్ లోకి రాకపోతే మాత్రం రాబోయే మ్యాచ్ లలో ఎంత స్కోర్ చేసినా ఫలితం ఉండదని అంటున్నారు.

ఇక ఆర్సీబీలో అత్యంత చెత్త ప్లేయర్ గా అల్జారీ జోసెఫ్‌ను ఆర్సీబీ అభిమానులు భావిస్తున్నారు. అతను ప్రతి మ్యాచ్ లోనూ దారునంగా విఫలం అవుతున్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో జోసెఫ్‌ కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన అతను ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో లక్నోతో మ్యాచ్ లో అతన్ని తీసేసి టోప్లీని ఆడిస్తే.. అతను లక్నోపై 4 ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుని.. విఫలం అయ్యాడు. కాబట్టి ఈ ముగ్గురిని తీసేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది