ATM Cash : డోంట్ వర్రీ.. డెబిట్ కార్డ్ లేకుండానే ఏటీఎం నుండి నగదు విత్ డ్రా చేసే సౌకర్యం గురించి మీకు తెలుసా?
ప్రధానాంశాలు:
ATM Cash : డోంట్ వర్రీ.. డెబిట్ కార్డ్ లేకుండానే ఏటీఎం నుండి నగదు విత్ డ్రా చేసే సౌకర్యం గురించి మీకు తెలుసా?
ATM Cash : డెబిట్ కార్డు లేకపోయినా నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఇప్పుడు ఆర్బీఐ కల్పిస్తోంది. నగదు విత్ డ్రా కోసం బ్యాంకర్లు ఏటీఎంలను ఏర్పాటు చేశాయి. పదేళ్ల క్రితం వరకు నగదు విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో ఏటీఎం దగ్గరి వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల మొబైల్ యాప్ ఆధారిత పేమెంట్స్ (యూపీఐ) డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏటీఎంకు వెళ్లి డెబిట్ క్యాష్ విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి.

ATM Cash : డోంట్ వర్రీ.. డెబిట్ కార్డ్ లేకుండానే ఏటీఎం నుండి నగదు విత్ డ్రా చేసే సౌకర్యం గురించి మీకు తెలుసా?
ATM Cash : కొత్త ఫీచర్..
మొబైల్ యాప్స్.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల సాయంతో డెబిట్ కార్డు లేకున్నా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ ఆధారంగా డెబిట్ కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.ఏటీఎంల వద్ద డెబిట్ కార్డు రహిత లావాదేవీల కోసం.. తొలుత ఏటీఎం స్క్రీన్‌పై యూపీఐ కార్డ్‌లెస్ క్యాష్ ఆప్షన్‌న్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత విత్‌డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. విత్ డ్రా సెక్షన్‌లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే తాత్కాలిక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది.
ఫోన్‌లోని బ్యాంకు యూపీఐ ఆధారిత యాప్‌తో దాన్ని స్కాన్ చేయాలి. యూపీఐ పిన్‌ను యాప్‌లో ఎంటర్ చేయాలి. ఆతరువాత ఏటీఎం నుంచి డబ్బులు బయటకు వస్తాయి. నగదు విత్‌డ్రా అయినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ కూడా వస్తుంది.యూపీఐ కార్డ్‌లెస్ విత్‌డ్రా లావాదేవీలపై రోజుకు కొన్నింటిపై కొన్ని బ్యాంకులు పరిమితులు విధించాయి. యూపీఐ కార్డ్‌లెస్ విత్‌డ్రా లావాదేవీల ఏటీఎంను భువనగిరి పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేశారు.