EV Royal Enfield : మార్కెట్‌లోకి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. ఎప్పుడు రానుంది అంటే..!
ప్రధానాంశాలు:
EV Royal Enfield : మార్కెట్‌లోకి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. ఎప్పుడు రానుంది అంటే..!
EV Royal Enfield : ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకి డిమాండ్ పెరిగింది. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకూ ఎలక్ట్రికల్ వాహనాలని మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నాయి. ప్రముఖ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్‌కు సంబంధించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఎట్టకేలకు కొత్త డిజైన్ పేటెంట్లో వెల్లడైంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను అంతర్గతంగా ఎలక్ట్రిక్ 01 అని పిలుస్తారని ఈ బైక్ భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత దానికి వేరే పేరు పెట్టే అవకాశం ఉంది. 350-700 cc సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోడల్‌లో మాత్రం ఇంకా అందుబాటులో లేదు.
EV Royal Enfield ఫీచర్స్ ఇవే..
కానీ ఇప్పుడు కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ సంబంధించిన పేటెంట్ ఫొటో ఒకటి బయటపడింది. దీని డిజైన్ ప్రత్యేకమైన బాబర్-స్టయిల్ రెట్రో డిజైన్‌తో ఉంటుంది. ఈ మోడల్ కోసం ఏడాదిన్నర పాటు వెయిట్ చేయక తప్పని పరిస్థితి. 2026 ప్రారంభంలో ఈ బైక్ మార్కెట్లోకి లాంచ్ కావొచ్చని అంచనా.రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్‌లో డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తుంది. ముఖ్యంగా 1920లలో చివరిసారిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లలో కనిపించిన గిర్డర్ ఫోర్కులు ఈవీ వెర్షన్‌లో మళ్లీ లాంచ్ చేస్తున్నారు. స్టార్క్ ఫ్యూచర్‌తో కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తుంది.
వెనుక భాగంలో అల్యూమినియం స్వింగార్మ్ ఉండే అవకాశం ఉంది. మోనోషాక్‌ని చక్కగా కనిపించకుండా సెట్ చేశారు. బైక్ టైర్లు సన్నగా కనిపిస్తున్నాయి. దీని ద్వారా రోలింగ్ కెపాసిటీ, స్పీడ్ పెంచుతుందని ఆశించవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కొత్త సరఫరా భాగస్వాములను సైన్ అప్ చేయడం, ఉత్పత్తి మార్గాలను ఏర్పాటు చేయడం పై కూడా పని చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ ఆధునిక హంగులతో నియో-రెట్రో డిజైన్‌తో వస్తుంది. ఈ బైక్ ఫీచర్లు ఏంటి అనేది రానున్న రోజులలో పూర్తిగా తెలుస్తుంది.