Flipkart : ఫ్లిప్ కార్ట్ వాడే వారికి గుడ్ న్యూస్ .. ఫ్రీగా 5 లక్షల లోన్..!
Flipkart : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపుగా 5 లక్షల వరకు ఫ్లిప్కార్ట్ వాడేవారికి లోన్ లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళకుండా ఈజీగా లోన్ పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ కూడా పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తుంది. అయితే ఫ్లిప్కార్ట్ నేరుగా రుణాలు అందించదు. ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొని రుణ సౌకర్యం అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ వాడేవారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఐదు లక్షల వరకు లోన్ పొందవచ్చు. పేపర్ లెస్ ప్రాసెస్ లో లభిస్తుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా కేవలం ఆన్లైన్ ద్వారా పూర్తి వివరాలను ఎంటర్ చేసి ఆ తర్వాత లోన్ పొందవచ్చు.
ఆకర్షణీయమైనా ఈఎంఐ బెనిఫిట్స్ పొందవచ్చు. కేవలం 30 సెకండ్ల లోనే లోన్ అప్రూవల్ పొందవచ్చు. ఈ లోన్ అప్లై చేయడానికి ముందుగా ఫ్లిప్కార్ట్ యాప్ లోకి వెళ్లి ఆ తర్వాత యాప్ కింద వైపున కేటగిరి అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే అక్కడ మనీ ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీనికి మీకు ఎంత క్రెడిట్ అందుబాటులో ఉందో చూడవచ్చు. దీని కింద పర్సనల్ లోన్ ఆప్షన్ కనిపిస్తుంది. కంటిన్యూ అప్లికేషన్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.
ఇందులో పాన్ కార్డ్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. తర్వాత వర్క్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కంపెనీ పేరు, శాలరీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. అర్హత ఉన్నవారు బ్యాంకు నుంచి లోన్ పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంకు తో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని రుణాలు అందిస్తుంది. యాక్సిస్ బ్యాంకు నుంచి లోన్ పొందవచ్చు. లోన్ కోసం ఫ్లిప్కార్ట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఫ్లిప్కార్ట్ ద్వారా ఈజీగా లోన్ పొందవచ్చు. పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు లోనికి అర్హులా కాదా అని తెలుస్తుంది. ఇలా ఈజీగా ఫ్లిప్కార్ట్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.