iPhone 14 : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే ఐఫోన్-14 లాంచ్.. ఓ లుక్కేయండి?
iPhone 14 : ప్రముఖ అంతర్జాతీయ మొబైల్ దిగ్గజం ఆపిల్ సంస్థ తమ వాల్యూబుల్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఆపిల్ ఐఫోన్-13 మోడల్ సేల్స్ తగ్గడంతో డిస్కౌంట్ ధరకు అమ్మేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.అయితే, డిస్కౌంట్ ధరకు ఐఫోన్ కొనాకునే వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. త్వరలోనే ఐఫోన్ 14 వేరియంట్ విడుదలకు సిద్ధంగా ఉందని.. అది కూడా ఐఫోన్ -13 కంటే తక్కువ ధరకు రానుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
iPhone 14 : ఐఫోన్-13 కంటే 14లో బెటర్ ఫీచర్స్..
ఆపిల్ ప్రతీ ఏడాది కొత్త సిరీస్‌ను లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే.చాలా మంది కొత్త సిరీస్ రాగానే దానికి అప్డేట్ అయిపోతుంటారు. పాత ఫోన్లను సెకండ్ హ్యాండ్‌లో అమ్మడం లేదా ఎక్సేంజ్ చేస్తుంటారు.అయితే, ఐఫోన్ -13 సేల్స్ పడిపోవడంతో కంపెనీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించి సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తమ వినియోగదారులను ఆకర్షించేందుక ఐఫోన్-14 విడుదలకు సంబంధించిన సమాచారాన్ని బయటకు రిలీజ్ చేసింది. దీంతో ఐఫోన్ -13 కొనుగోలు చేసేవారు తొందరపడొద్దని.. ఏకంగా ఐఫోన్-14 కొంటే బెటర్ అని.. దాని ధర ఐఫోన్ 13 కంటే తక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ ట్రండ్ ఫోర్స్ ప్రకారం సాధారణ iPhone 14 ధర ఊహించిన దాని కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఐఫోన్ -14 బేస్ మోడల్ ధర చాలా తక్కువగా ఉండనుందట.. ఐఫోన్ 14 మ్యాక్స్, 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ -14 (128GB) బేస్ వేరియంట్ ధర 750 డాలర్లు (దాదాపు రూ.59,600)గా ఉంటుందని నివేదిక అంచనా వేస్తోంది. ఐ ఫోన్ -13 (128GB) ప్రారంభ ధర 799 డాలర్లు (దాదాపు రూ. 63,600)తో లాంచ్ అయిన విషయం తెలిసిందే.ఐఫోన్ -14 మ్యాక్స్ ధర.. ఐఫోన్-14 కన్నా కనీసం 100 డాలర్లు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్రో, ప్రోమ్యాక్స్ వేరియంట్‌లు వరుసగా 1,050 డాలర్లు (రూ.83,500), 1,150 డాలర్లు (రూ.91,400)గా ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఐఫోన్-14 విడుదలకు సంబంధించిన స్పెషల్ ఈవెంట్ ఉంటుందని తెలుస్తోంది.