Jio : జియో వినియోగదారులకి శుభవార్త. రూ.189 రీఛార్జ్ తో అన్లిమిటెడ్ కాల్స్ మరియు SMS డేటా..!
Jio : జియో సంస్థ తమ యూజర్ల కోసం ఒక శుభవార్త తీసుకువచ్చింది. గతంలో ఎంతో పాపులర్ ప్లాన్ అయినటువంటి రూ.189 కి అన్ లిమిటెడ్ కాల్స్ , SMS డేటా రీఛార్జ్ ను తిరిగి తీసుకువచ్చింది. అయితే రిలయన్స్ జియో JIO ప్రారంభంలో ఉన్నటువంటి రూ 189 మరియు రూ 479 అత్యధిక డిమాండ్ ఉన్న ప్లాన్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జియో సంస్థ ఆ ప్లాన్లను తిరిగి ప్రవేశపెట్టింది. దీనిలో 189 ప్లాన్ ద్వారా సరసమైన ధరకే కాల్స్ ,SMS మరియు డేటాను అందిస్తుంది.

Jio : జియో వినియోగదారులకి శుభవార్త. రూ.189 రీఛార్జ్ తో అన్లిమిటెడ్ కాల్స్ మరియు SMS డేటా..!
Jio రూ.189 రీఛార్జ్ …
ఎంతో డిమాండ్ ఉన్న రూ.189 రీఛార్జ్ ప్లాన్ లో మొత్తం 2 జిబి డేటా వస్తుంది. అంటే తక్కువ డేటాను వినియోగించే ఈ రీఛార్జ్ చాలా అనువైనది. దాంతోపాటు 300 SMS లు కూడా వస్తాయి. ఇక ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు 28 రోజులు పాటు చెల్లిబాటు పొందవచ్చు. అంతేకాక దీనిలో జియో టీవీ ,జియో సినిమా మరియు జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అలాగే అపరిమిత కాల్స్ మరియు SMS తో పాటు తక్కువ డేటా వినియోగించే వారికి రూ.189 రీఛార్జి ప్లాన్ చాలా అనువైనది అని చెప్పవచ్చు.
Jio రూ.479 ప్లాన్ రాలేదు…
అయితే గతంలో 189 ప్లాన్ తో పాటు 479 ప్లాన్ కూడా రిలయన్స్ జియో నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 189 ప్లాన్ తో పాటు 479 ప్లాన్ ను సంస్థ తిరిగి తీసుకురాలేదు. ఇక ఈ రీఛార్జిలో మొత్తం 6 జిబి డేటా అపరిమిత కాల్స్ రోజుకు 100 SMS లు 28 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ కి కూడా డిమాండ్ చాలా ఉన్నప్పటికీ జియో దీనిని తిరిగి తీసుకురాలేదు. అలాగే జియో ఇప్పుడు 448 ప్లాన్ ను కాస్త తగ్గించి 445 అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక దీనిలో రోజుకు 2gb డేటా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. అంతేకాక దీనికి Zee5, జియో సినిమా ప్రీమియం ,మరియు సోనీ లైవ్ వంటి సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. అయితే బడ్జెట్ స్నేహపూర్వక ప్లాన్ కోరుకునే వినియోగదారుల కోసం మాత్రం 189 ప్లాన్ తిరిగి తీసుకురావడం గొప్ప నిర్ణయం.