Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా...?

  •  24 సంవత్సరాల ఏఐ పరిశోధకుడికి వేల కోట్ల జీతం ఆఫర్ ఇచ్చిన మార్క్ జుకర్‌బర్గ్

  •  Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా...?

Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో టెక్ దిగ్గజాల మధ్య ఏఐ నిపుణుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ పోటీలో ముందంజలో ఉండటానికి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం 24 సంవత్సరాల ఏఐ పరిశోధకుడు మాట్ డిట్కేను తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం నియమించుకోవడానికి ఏకంగా రూ. 2,196 కోట్ల జీతం ప్యాకేజీని ఆఫర్ చేశారు. మొదట రూ. 1,098 కోట్ల ఆఫర్‌ను డిట్కే తిరస్కరించినప్పటికీ, జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా కలసి జీతాన్ని రెట్టింపు చేయడంతో అతను మెటాలో చేరడానికి అంగీకరించారు. ఈ భారీ నియామకం ద్వారా ఏఐ రంగంలో మెటా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.

Mark Zuckerberg 24 ఏళ్ల కుర్రాడికి 2196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్ ఎందుకో తెలుసా

Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…?

Mark Zuckerberg 24 సంవత్సరాల యువకుడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్

ఈ భారీ ప్యాకేజీ ఆఫర్‌కు కారణం సిలికాన్ వ్యాలీలో ఏఐ టాలెంట్‌ కోసం ఉన్న తీవ్రమైన పోటీ అని అమెరికన్ మీడియా వెల్లడించింది. మెటా తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను నిర్మించడానికి అత్యుత్తమ టెక్ నిపుణులను ఆకర్షించేందుకు భారీగా ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో, ఓపెన్ఏఐ, గూగుల్, ఆపిల్ వంటి ప్రత్యర్థి సంస్థల నుండి టాప్ పరిశోధకులను తమ సంస్థలోకి తీసుకుంటోంది. డిట్కేతో పాటు, ఆపిల్ ఏఐ మోడల్స్ టీమ్ మాజీ అధిపతి రుయోమింగ్ పాంగ్‌కు కూడా రూ. 200 మిలియన్లకు పైగా ప్యాకేజీ ఆఫర్ చేసి మెటా తన ల్యాబ్‌లో చేర్చుకుంది. ఈ భారీ పెట్టుబడులు, నియామకాలతో ఏఐ రంగంలో మెటా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.

మాట్ డిట్కే వాషింగ్టన్ యూనివర్శిటీలో ఏఐలో పీహెచ్‌డీ చదువుతూ మధ్యలో ఆపేసి అలెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఏఐలో చేరారు. అక్కడ అతను “మోల్మో” అనే అత్యాధునిక చాట్‌బాట్‌పై పనిచేశారు. ఇది టెక్స్ట్‌తో పాటు ఫోటోలు, ఆడియోను కూడా ప్రాసెస్ చేయగలదు. ఈ కృషికి అతనికి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు కూడా లభించింది. అతని సామర్థ్యాన్ని గుర్తించిన జుకర్‌బర్గ్, మెటాలో చేరడానికి గత సంవత్సరం నుండే ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం డిట్కే ఈ భారీ ఆఫర్‌కు అంగీకరించినట్లు సమాచారం. ఈ నియామకం పూర్తయితే ఏఐ రంగంలో ఇది ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది. మెటా భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ భారీ పెట్టుబడులు ఏఐ పరిశోధనను ఏ దిశగా నడిపిస్తాయో చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది