Facebook : ఇక నుంచి ఫేస్ బుక్ కాదు.. పేరును మార్చేస్తున్న మార్క్ జూకర్ బర్గ్? కొత్త పేరు ఏంటో తెలుసా?
Facebook : ఫేస్ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి అందరికీ తెలుసు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల యూజర్లు ఫేస్ బుక్ కు ఉన్నారు. ఫేస్ బుక్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్. సోషల్ మీడియాతో ఎక్కువగా కనెక్ట్ అయ్యేవాళ్లు ఫేస్ బుక్ నే ఫాలో అవుతుంటారు. అయితే.. ఈ మధ్య ఈ సంస్థ చాలా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల ఫేస్ బుక్ కొన్ని గంటల పాటు ఆగిపోయింది. దానితో పాటు తన అనుబంధ ప్లాట్ ఫామ్ లు అయిన ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ కూడా ఆగిపోయాయి.
దీని వల్ల చాలామంది యూజర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకేసారి కొన్ని గంటల పాటు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ పనిచేయకపోవడంతో కొట్ల మంది యూజర్లకు కాళ్లు చేతులు ఆడలేదు. ఆ తర్వాత ఫేస్ బుక్ లో వచ్చిన సమస్య పోయింది. మళ్లీ యథావిధిగా ఫేస్ బుక్ పనిచేసినప్పటికీ త్వరలో ఫేస్ బుక్ పేరును మార్చాలని కంపెనీ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ భావిస్తున్నారట.
Facebook : ఈనెల 28న కొత్త పేరును ప్రకటించనున్న మార్క్
ఈనెల 28న ఫేస్ బుక్ కొత్త పేరును మార్క్ జూకర్ బర్గ్ ప్రకటిస్తారని సమాచారం. అసలు ఫేస్ బుక్ పేరును మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది.. అనేదే చాలామందికి అంతు చిక్కని ప్రశ్న. ఈనెల 28న అంటే గురువారం ఫేస్ బుక్ వార్షిక సదస్సు జరగనుంది. ఆ సదస్సులో మార్క్ ఫేస్ బుక్ పేరు మార్పు గురించి ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.ఇప్పటి వరకు ఫేస్ బుక్ చాలా విమర్శలు ఎదుర్కున్న నేపథ్యంలో పేరు మార్చి ఫేస్ బుక్ ను సరికొత్తగా మార్చాలని మార్క్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కంపెనీ మెటావర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో.. దాని కోసం పేరు మార్చాలని భావిస్తోంది.
Facebook : మెటావర్స్ అంటే ఏంటి?
మెటావర్స్ అంటే కొన్ని రకాల టెక్నాలజీలను డెవలప్ చేసి అన్నింటినీ ఇంటిగ్రేట్ చేయడం. ఫేస్ బుక్ చాలా రోజుల నుంచి వర్చువల్ రియాల్టీ మీద పనిచేస్తోంది. అలాగే.. ఆన్ లైన్ గేమింగ్ మీద కూడా పనిచేస్తోంది. ఆగ్యుమెంటెడ్ రియాల్టీ, డిజిటల్ రియాల్టీ మీద కూడా వర్క్ చేస్తోంది. వీటన్నింటినీ కలిపి మెటావర్స్ అనే పేరు పెట్టి.. వాటి మీద వర్క్ చేస్తోంది. భవిష్యత్తులో మెటావర్స్ టెక్ యుగాన్ని శాసిస్తుందని మార్క్ చాలా సందర్భాల్లో చెప్పారు.