GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 8, 2025, 4:00 pm
  •  GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. జులై నుంచి ట్యాక్స్ టైం అంటే జులై నెలకు సంబంధించి రిటర్నులు ఆగస్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. వాస్తవ గడువు తేదీ నుంచి మూడేళ్ల సమయం దాటినట్లయితే జీఎస్‌టీఆర్- 1, జీఎస్‌టీఆర్ 3బీ, జీఎస్‌టీఆర్ 4, జీఎస్‌టీఆర్ 5, జీఎస్‌టీఆర్ 5ఏ, జీఎస్‌టీఆర్ 6, జీఎస్‌టీఆర్ 7, జీఎస్‌టీఆర్ 8, జీఎస్‌టీఆర్ 9 లు ఫైలింగ్ చేసేందుకు అవకాశం ఉండదని వస్తు సేవల పన్ను నెట్‌వర్క్ తెలిపింది.

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : ఆల‌స్యం చేయ‌కండి..

జులై 2025 పన్ను కాలం నుంచి జీఎస్‌టీ పోర్టల్‌లో ఈ కొత్త పరిమితులు అమలు చేయబడతాయి.’ అని అడ్వైజరీలో స్పష్టం చేసింది గత ఏడాది 2024 అక్టోబర్ నెలలోనే ట్యాక్స్ పేయర్లను అలర్ట్ చేసింది జీఎస్‌టీ నెట్‌వర్క్. 2025 తొలినాళ్లలోనే జీఎస్‌టీ రిటర్నుల కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని, రిటర్నులు ఫైలింగ్‌కు టైమ్ లిమిట్ విధిస్తున్నట్లు హెచ్చరించింది.

వస్తు సేవల పన్నును జులై 1, 2017లో అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి వచ్చినట్లయింది. అయితే, కొంత గందరగోళం నెలకొన్నట్లు ట్యాక్స్ నిపుణులు చెబుతుంటారు. ఆ తర్వాత చాలా మార్పులు చేస్తూ వచ్చింది కేంద్రం. ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తారని తెలుస్తోంది. 12 శాతం పన్ను శ్లాబును ఎత్తివేయాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  2. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  3. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  4. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  5. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  6. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  7. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp