UPI : అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ .. ఎప్ప‌టి నుండి అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

UPI : అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ .. ఎప్ప‌టి నుండి అంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 July 2025,9:43 pm

ప్రధానాంశాలు:

  •  UPI : అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ .. ఎప్ప‌టి నుండి అంటే..!

UPI : యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్తగా ప్రకటించిన రూల్స్ ఎప్ప‌టి నుండి అమ‌ల్లోకి రానున్నాయి అనే సందేహం అంద‌రిలో ఉంది. అయితే ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆటో-పే, బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ వంటి అనేక సేవలకు వర్తించే ఈ రూల్స్ ఏంటో చూస్తే… యూపీఐ సేవలను మరింత విశ్వసనీయంగా తీర్చి దిద్దేందుకు ఎన్‌పీసీఐ ఈ కొత్త రూల్స్‌ను ప్రకటించింది.

UPI అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ ఎప్ప‌టి నుండి అంటే

UPI : అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ .. ఎప్ప‌టి నుండి అంటే..!

UPI : అప్ప‌టి నుండే అమ‌లు..

కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఆటోపే చెల్లింపులు నిర్దిష్ట సమయాల్లోనే జరుగుతాయి. మునుపటిలా రోజంతా ఈ చెల్లింపులకు ఆస్కారం ఉండదు. ఆటో పేమెంట్స్, సబ్‌స్క్రిప్షన్స్, యూటిలిటీ బిల్స్, ఈఎమ్‌ఐ వంటి వాటన్నిటికీ ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. ఇవన్నీ తెరవెనుక జరిగే కార్యకలాపాలే. ఆగస్టు 1 నుంచి వినియోగదారులు యూపీఐ ద్వారా తమ అకౌంట్‌ బ్యాలెన్స్‌ను రోజుకు 50 సార్లు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం ఉంది.

ఇక డిజిటల్ చెల్లింపులపై చార్జీల విధింపు గురించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. యూపీఐ చెల్లింపుల వ్యవస్థకు ఆర్థిక సుస్థిరత చేకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెల్లింపులకు అయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఈ విధానం ఎక్కువ కాలం మనలేదని స్పష్టం చేశారు. ఏ సేవ అయినా సుస్థిరంగా కొనసాగాలంటే కొంత డబ్బు చెల్లించక తప్పదని చెప్పారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది