RBI సరికొత్త సేవలు…చాలా సులభంగా బ్యాంకు అకౌంట్ లోకి డబ్బు డిపాజిట్…!
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) తాజాగా ఒక విప్లవాత్మకమైన సేవను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే RBI ప్రవేశపెట్టిన ఈ సేవ నగదు డిపాజిట్ లను సులభతరం చేస్తుంది మరియు బ్యాంకు ఖాతాదారులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ సేవ ద్వారా అప్డేటెడ్ డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే వినియోగదారులు ATMలో లేదా బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇంటర్ ఆఫర్ క్యాష్ డిపాజిట్ UPI-ICD అని పిలవబడే […]
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) తాజాగా ఒక విప్లవాత్మకమైన సేవను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే RBI ప్రవేశపెట్టిన ఈ సేవ నగదు డిపాజిట్ లను సులభతరం చేస్తుంది మరియు బ్యాంకు ఖాతాదారులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ సేవ ద్వారా అప్డేటెడ్ డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే వినియోగదారులు ATMలో లేదా బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇంటర్ ఆఫర్ క్యాష్ డిపాజిట్ UPI-ICD అని పిలవబడే ఈ కొత్త ఫ్యూచర్ ను ఆర్.బి.ఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ ఇటీవల ప్రారంభించడం జరిగింది.
RBI UPI-ICD సేవల ముఖ్య లక్ష్యం…
కార్డు లెస్ క్యాస్ట్ డిపాజిట్లు : సాధారణంగా అయితే ATM లేదా బ్యాంకు ఖాతా లో డబ్బును డిపాజిట్ చేయాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు అవసరమవుతుంది. కానీ ఈ సరికొత్త సేవతో కస్టమర్లు వారి యొక్క మొబైల్ నెంబర్ లేదా వారి బ్యాంక్ ఖాతా యొక్క IFSC కోడ్ ఉపయోగించుకుని డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. తద్వారా ఈ సేవ బౌతికంగా డెబిట్ కార్డు యొక్క అవసరాన్ని తొలగిస్తుంది.
ఇంటర్ ఆఫరేబిలిటీ : UPI-ICD సేవలను వినియోగించుకుని కస్టమర్లు వారి సొంత బ్యాంకు ఖాతాలకు మాత్రమే కాకుండా వివిధ బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే ఈ సేవలు పరస్పరం పనిచేయగలవు.
నగదు డిపాజిట్ సులభం: అయితే ఈ సేవను వినియోగించి నగదు డిపాజిట్ చేయడం కూడా చాలా సులభం. దీనికోసం మీరు ముందుగా ATMను సందర్శించి స్క్రీన్ పై నగదు డిపాజిట్ ఎంపికను ఎంచుకోవాలి. అనంతరం మీ మొబైల్ నెంబర్ లేదా బ్యాంక్ యొక్క IFSC కోడ్ నమోదు చేయాలి. అనంతరం డిపాజిట్ చేయాల్సిన మొత్తం డబ్బుని పేర్కొని ఇన్సర్ట్ చేయాలి. అనంతరం యంత్రం లోకి డబ్బు వెళుతుంది. దానిలో పేర్కొన్న ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది.
RBI ప్రయోజనాలు…
UPI-ICD సేవలు డబ్బు డిపాజిట్ చేయడానికి డెబిట్ కార్డ్ అవసరాన్ని తొలగిస్తుంది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా పని జరుగుతుంది. ఈ సేవలో ముఖ్యంగా డెబిట్ కార్డులను పోగొట్టుకున్న వారికి ,లేదా ఇంట్లోమరిచి వచ్చిన వారికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక ఈ సేవలను వినియోగించి కస్టమర్లు వారి సొంత బ్యాంకు ఖాతాలకే కాకుండా మరో బ్యాంక్ ఖాతాకు కూడా డబ్బు బదిలీ చేయవచ్చు. ఇక ఈ సేవలను వినియోగించుకుని కస్టమర్లు బ్యాంకులో సందర్శించకుండా లేదా లైన్ లో వేచి ఉండకుండానే నగదు డిపాజిట్లు చేసుకోవచ్చు. అందుకే ఇది కస్టమర్లకు మరింత అనుకూలమైన ప్రక్రియగా చెప్పవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాలు లేదా బ్యాంకు శాఖలో సులభంగా పనిచేయలేని ప్రదేశాలలోఈ సేవలు ప్రత్యేకంగా సహాయపడతాయి. కానీ ఆయా ప్రదేశాలలో కచ్చితంగా ATM అందుబాటులో ఉండాలి. అప్పుడే మీరు ఈ సేవలను వినియోగించుకోగలుగుతారు.