Realme Smartphone : రాబోతున్న రియల్ మీ సరికొత్త స్మార్ట్ ఫోన్… విడుదల ఎప్పుడంటే…

Authored By aruna | The Telugu News | Published on: September 5, 2022, 7:30 am

Realme Smartphone : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వినియోగం ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అన్ని పనులను ఇంట్లో కూర్చుని సెల్ ఫోన్ ద్వారా చేసుకుంటున్నారు. అందుకే మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. రియల్ మీ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. రియల్ మీ సి33 నీ ఇండియాలో విడుదల చేయడానికి సెప్టెంబర్ 6వ తేదీన నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది.

రియల్ మీ నుండి రాబోయే స్మార్ట్ ఫోన్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతానికి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడించలేదు. అయితే ఫోన్ కోసం మైక్రో సైట్ అధికారిక రియల్ మీ ఇండియా వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఇది డ్యూయల్ రియల్ కెమెరా సెట్ అప్ స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ నెలలో రియల్ మీ సి33 మూడు కలర్స్ లో అందుబాటులోకి రానుంది. రియల్ మీ సి 33 సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ రియర్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది.

Realme new smartphone launched in India by September 6

Realme new smartphone launched in India by September 6

50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ను కలిగి ఉంటుంది. రియల్ మీ ప్రకారం స్మార్ట్ ఫోన్ సెగ్ మెంట్ లో అత్యధిక పిక్సెల్ పనితీరును అందిస్తుంది. స్పష్టమైన బ్యాక్లిట్ ఫోటోల కోసం CHDR అల్గోరిథంతో వస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 37 రోజుల స్టాండ్ బై ని అందిస్తుందని తెలుస్తుంది. ఈ ఫోన్ బరువు 187 గ్రాములు ఉంటుందని రియల్ మీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆక్వా బ్లూ, శాండీ గోల్డ్, నైట్ సి కలర్ ఆప్షన్లలో రానుందని తెలుస్తుంది. 3జిబి ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 4 జీబి ర్యామ్ + 64 జీబీ ర్యామ్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్+ 128జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,500 నుంచి రూ.10,500 వరకు ఉండే అవకాశం ఉంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp