Smart Phone : గుడ్‌న్యూస్.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్.. అసలు ఛార్జింగ్ పెట్టాల్సిన పనే లేదు..!
ప్రధానాంశాలు:
Smart phone : గుడ్‌న్యూస్.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్.. ఛార్జింగ్ పెట్టాల్సిన పనే లేదు..!
Smart Phone : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దలదాకా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. కాస్త ఖాళీ సమయం దొరికిన ఫోన్ లో మునిగితేలుతుంటారు. మనకు స్మార్ట్ ఫోన్ నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే అదే సమయంలో ఫోన్ కు రోజు బ్యాటరీ చార్జింగ్ చేయడం మాత్రం తప్పనిసరి. వాడకాన్ని బట్టి కొంతమంది రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు ఛార్జింగ్ చేస్తూ ఉంటారు. ఇక మూడుసార్లు ఛార్జింగ్ చేసే మహానుభావులు కూడా ఉంటారు. అలాగే ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్ కచ్చితంగా తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో బ్యాటరీ సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఎక్కువ కెపాసిటీ తో బ్యాటరీలను అందిస్తున్నాయి.
ప్రజలు కూడా వీటిని కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ బ్యాటరీ సమస్యల నుంచి పూర్తిగా బయటపడడానికి అసలు ఛార్జింగ్ అవసరం లేని బ్యాటరీలను తయారు చేస్తున్నారు. ఛార్జింగ్ అవసరం లేని బ్యాటరీలను తయారు చేస్తున్నారు. వీటిని స్మార్ట్ ఫోన్లో అన్నించి వాటిని చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా చూడాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెటా వోల్ట్ టెక్నాలజీ అని చైనీస్ కంపెనీ స్మార్ట్ ఫోన్ లను కొన్ని ఏళ్లపాటు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండే విధంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది. దీనికోసం రేడియో న్యూక్లిడ్ బ్యాటరీ నీ తయారు చేస్తుంది. ఈ టెక్నాలజీ చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఇది కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే స్మార్ట్ ఫోన్ లను దాదాపు 50 ఏళ్ల పాటు ఛార్జింగ్ చేయకుండా వాడవచ్చు. ప్రస్తుతం కంపెనీ తన మొదటి మోడల్ అభివృద్ధి చేసింది. ఇది 100 మైక్రో వాట్ల విద్యుత్ అందజేస్తుంది.
రానున్న రెండేళ్లలో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి చిన్న బ్యాటరీలను తయారు సొంతంగా పనిచేస్తే స్మార్ట్ ఫోన్లో దీనిని అందిస్తారు. చైనా సంస్థ తయారు చేస్తున్న బ్యాటరీలు రేడియో ధార్మిక క్షయం ఆధారంగా శక్తిని పొందుతాయి. కంపెనీ 10 మైక్రో మీటర్ల కృత్రిమ డైమండ్ పొరను ఉపయోగించే మోడల్ పై పనిచేస్తుంది. ఇది సెమీ కండక్టర్ లాగా పనిచేస్తూ తగ్గిపోతున్న నికెల్ ఐసోటోప్ తో కలిసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. సిస్టం నుండి రేడియేషన్ బయటికి రాకుండా ఉంటుందని అలాగే ఎలాంటి విష రసాయనాలు ఉత్పత్తి కావని సంస్థ తెలుపుతుంది. బ్యాటరీలు దాదాపు 60 నుండి 120 డిగ్రీల సెల్సియస్ లో కూడా వాడుకోవచ్చని దాదాపు 50 సంవత్సరాలు వరకు బ్యాకప్ అందించగలదని కంపెనీ తెలిపింది…..