Credit Score : వీటిని ఫాలో అయితే మీ క్రిడెట్ స్కోర్ ఎప్పటికి తగ్గదు..!
ప్రధానాంశాలు:
Credit Score : వీటిని ఫాలో అయితే మీ క్రిడెట్ స్కోర్ ఎప్పటికి తగ్గదు..!
Credit Score : క్రెడిట్ స్కోర్ అనేది వ్యక్తి ఆర్థిక స్థిరతను ప్రతిబింబించే ముఖ్యమైన కారకం. చాలామంది సకాలంలో క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించినప్పటికీ తమ స్కోర్ తగ్గిపోతుందని గమనిస్తారు. దీని వెనుక ప్రధానంగా క్రెడిట్ వినియోగ నిష్పత్తి ( Credit Utilization Ratio ) ఒక కీలక కారణంగా ఉంటుంది. మీరు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో 30% కన్నా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తే, బ్యాంకులు మిమ్మల్ని ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తాయి. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అదే విధంగా మీరు ఎక్కువ మొత్తంలో బకాయిలు తెచ్చుకున్నా, పాత రుణాలను పూర్తిగా చెల్లించకపోయినా స్కోర్ తగ్గే అవకాశం ఉంది.

Credit Score : వీటిని ఫాలో అయితే మీ క్రిడెట్ స్కోర్ ఎప్పటికి తగ్గదు..!
Credit Score క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గుతుందో తెలుసా..?
అలాగే కొత్త క్రెడిట్ కార్డులు లేదా రుణాల కోసం పదేపదే దరఖాస్తు చేయడం కూడా మీ స్కోర్ తగ్గడానికి కారణం కావచ్చు. ప్రతి సారి మీరు క్రెడిట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, అది మీ క్రెడిట్ నివేదికపై ప్రభావం చూపిస్తుంది. మీరు ఎక్కువ మంది రుణదాతలకు దరఖాస్తు చేసుకుంటే, బ్యాంకులు మిమ్మల్ని రిస్క్ ఉన్న రుణగ్రహీతగా పరిగణించవచ్చు. మరోవైపు సకాలంలో కొన్ని బిల్లులు చెల్లించినప్పటికీ, ఇతర రుణాల చెల్లింపులను మిస్ అయితే అది మీ మొత్తం క్రెడిట్ చరిత్రను దెబ్బతీస్తుంది. ఈ ఆలస్య చెల్లింపుల వల్ల ఒకే ఒక్క తప్పిదం కూడా మీ స్కోర్‌ను గణనీయంగా తగ్గించవచ్చు.
పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం కూడా క్రెడిట్ స్కోర్ తగ్గడానికి కారణం అవుతుంది. పాత ఖాతాలు తెరిచే ఉంచడం వల్ల మీ క్రెడిట్ చరిత్ర ఎక్కువగా ఉండటమే కాకుండా మీ మొత్తం క్రెడిట్ పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి క్రెడిట్ ప్రొఫైల్‌ను కలిగి ఉన్నట్లు చూపిస్తుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ నివేదికను తరచుగా తనిఖీ చేయడం ద్వారా ఏదైనా తప్పిదాలు ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు. క్రెడిట్ వినియోగాన్ని 30% లోపుగా ఉంచడం, కొత్త రుణ దరఖాస్తులను తగ్గించడం, సకాలంలో చెల్లింపులు చేయడం వంటి చర్యలు మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరిచేలా సహాయపడతాయి. సో పై విషయాలను దృష్టిలో పెట్టుకొని క్రిడెట్ కార్డు వాడండి.