Twitter : ట్విట్టర్ యూజర్లు ఎగిరి గంతేసే న్యూస్.. సూపర్బ్ ఫీచర్ ను తీసుకురాబోతున్న ట్విట్టర్
Twitter : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ నుంచి సూపర్బ్ అప్ డేట్ వచ్చింది. యూజర్లందరికీ ఉపయోగపడే బెస్ట్ ఫీచర్ ను ట్విట్టర్ త్వరలో తీసుకురాబోతోంది. చాలా సంవత్సరాల నుంచి ట్విట్టర్ యూజర్ల నుంచి వస్తున్న రిక్వెస్ట్ ఆధారంగా ట్విట్టర్ సరికొత్త ఫీచర్ ను తీసుకురానుంది. అదే ఎడిట్ బటన్. ట్వీట్లను ఎడిట్ చేసే అవకాశాన్ని ట్విట్టర్ త్వరలో కల్పించబోతోంది. ప్రస్తుతం ఒకసారి ట్వీట్ పోస్ట్ చేశాక దాన్ని మళ్లీ ఎడిట్ చేసే అవకాశం లేదు. దాని వల్ల చాలామంది యూజర్లు సమస్యలు ఎదుర్కుంటున్నామని.. ఎలాగైనా ఎడిట్ ఆప్షన్ ను పెట్టాలని ట్విట్టర్ కు రిక్వెస్ట్ పెట్టారు. చాలా ఏళ్ల నుంచి వస్తున్న రిక్వెస్టుల ఆధారంగా ఎడిట్ బటన్ ను తీసుకొస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది.
ప్రస్తుతం ఈ ఎడిట్ బటన్ ఆప్షన్ ను ఇంటర్నల్ గా ట్విట్టర్ టెస్ట్ చేస్తోంది. అయితే.. ఈ ఫీచర్ కేవలం ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రైబర్స్ కు మాత్రమే త్వరలో అందుబాటులోకి రానుంది. ఒకసారి ట్వీట్ చేశాక.. 30 నిమిషాల లోపు ఆ ట్వీట్ ను ఎడిట్ చేసుకోవచ్చు. అయితే.. ఒకసారి ట్వీట్ ను ఎడిట్ చేస్తే.. అది ఎడిట్ చేసిన ట్వీట్ అని అక్కడ కనిపించేలా ట్విట్టర్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఒరిజినల్ ట్వీట్ తో పాటు ఎడిట్ చేసిన ట్వీట్ ను కూడా యూజర్లు అక్కడ చూసే సదుపాయాన్ని కల్పించనుంది.
Twitter : ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ అంటే ఏంటి?
అయితే.. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇది ట్విట్టర్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ సర్వీస్. ఈ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే ట్విట్టర్ అందించే అదనపు ఫీచర్లు, ఇతర ఫంక్షనాలిటీని ఈ యూజర్లు ముందే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాధారణ యూజర్ల కంటే ముందే సబ్ స్క్రైబ్ చేసుకున్న యూజర్లు ట్విట్టర్ తీసుకొచ్చే సరికొత్త ఫీచర్లను యాక్సెస్ చేసుకోగలరు. ప్రస్తుతం ఈ ఫీచర్ ను ఇంటర్నల్ గా టెస్ట్ చేస్తున్నామని.. త్వరలోనే ఈ ఫీచర్ ను ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రైబర్స్ ను అందుబాటులోకి తెస్తామని.. అంతా ఓకే అనిపిస్తే అందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని ట్విట్టర్ తాజాగా ప్రకటించింది. ఎడిట్ బటన్ తో పాటు.. అన్ డూ బటన్ ను కూడా ట్విట్టర్ తీసుకురానుంది. ఒకసారి ట్వీట్ చేశాక.. 30 సెకన్ల లోపు ఆ ట్వీట్ ను అన్ డూ చేసుకునే అవకాశాన్ని అన్ డూ ఆప్షన్ ద్వారా ట్విట్టర్ అందించనుంది. ట్విట్టర్ బ్లూ అనే ఫీచర్ ప్రస్తుతం కేవలం యూఎస్, ఆస్ట్రేలియా, కెనెడా, న్యూజిలాండ్ దేశాల్లో మాత్రమే ఉంది. భారత్ లో ఇంకా ఈ ఫీచర్ ను ట్విట్టర్ లాంచ్ చేయలేదు.