Twitter : ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్ తో వాటన్నింటికి చెక్ !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Twitter : ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్ తో వాటన్నింటికి చెక్ !!

 Authored By aruna | The Telugu News | Updated on :23 July 2023,8:00 pm

Twitter : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే. అందులో ఒకటైన ట్విట్టర్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరు ఏ విషయం చెప్పాలన్నా, తమ అభిప్రాయం తెలియజేయాలన్నా ట్విట్టర్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక ఇటీవల ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోరీ నుండి కొనుగోలు చేసే ప్రక్రియలో టెస్లా వ్యవస్థాపకుడు, మిలినీయర్ ఎలన్ మస్క్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. బ్లూ టిక్స్ తొలగించడం దగ్గర నుండి పలు మార్పులు, చేర్పులు తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

గతంలో ట్వీట్ చేయాలంటే అక్షరాలకు పరిమితి ఉండేది. గతంలో 140 అక్షరాలు రాసే వీలుండగా 2018లో 280కి పెంచింది. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ ఆర్టికల్ పేరుతో కొత్త ఫీచర్ను తీసుకురాబోతున్నారు. ఈ ఫీచర్ తో యూజర్లు పెద్దపెద్ద వ్యాసాలు రాయచ్చు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ఈ ఫీచర్ తో అక్షరాల పరిమితికి చెక్కు పడినట్లే. ఇక ట్వీట్ల రూపంలో ఏదైనా చెప్పాలంటే 10 ట్వీట్లు చేయాల్సిన అవసరం లేదు. ఓ చిన్న పుస్తకమే రాయవచ్చు. కంటెంట్ యూజర్లకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. అలాగే ఎలన్ మాస్క్ బ్లూ సబ్ స్క్రిప్షన్ పేరుతో కొన్ని ఫీచర్ల వినియోగంపై పరిమితులు విధించాడు.

Twitter new feature

Twitter new feature

గతంలో ట్వీట్లు చూడటంపై ఎటువంటి పరిమితి ఉండేది కాదు. అలాగే లాగిన్ అయితే మాత్రమే ఇతర ట్వీట్లు చూసే అవకాశం ఉంది. దీనికి తోడు బ్లూ టిక్ కొనుగోలు చేసిన యూజర్లకు మాత్రమే పదివేల అక్షరాలు రాసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా ట్వీట్లు చూసుకునే వెసులుబాటు లభించింది. దీంతో చాలా మంది మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ యాప్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే అది అంతగా ఆకట్టుకోలేకపోతుంది. మరీ ఇప్పుడు తీసుకు వచ్చే ఫీచర్ కేవలం బ్లూటిక్ యూజర్లకా లేక అందరికీ అందుబాటులోకి తీసుకువస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది