WhatsApp : వాట్సాప్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ .. వచ్చే నెల నుంచి వాట్సాప్ బంద్..!
WhatsApp : ప్రస్తుతం వాట్సాప్ కి ఉన్న ఆదరణ మరే యాప్ కి లేదని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ లలో ఒకటి ఇది. అంతలా క్రేజ్ సంపాదించుకుంది వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఈ మెసేజ్ యాప్ ను వినియోగిస్తున్నారు. మార్కెట్లోకి ఎన్నో రకాల మెసేజ్ యాప్ లు వచ్చిన వాట్సాప్ క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. దీనికి కారణం వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ కావడమే. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి యూజర్ల అభిరుచులకు […]
WhatsApp : ప్రస్తుతం వాట్సాప్ కి ఉన్న ఆదరణ మరే యాప్ కి లేదని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ లలో ఒకటి ఇది. అంతలా క్రేజ్ సంపాదించుకుంది వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఈ మెసేజ్ యాప్ ను వినియోగిస్తున్నారు. మార్కెట్లోకి ఎన్నో రకాల మెసేజ్ యాప్ లు వచ్చిన వాట్సాప్ క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. దీనికి కారణం వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ కావడమే. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి యూజర్ల అభిరుచులకు అనుగుణంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.
ముఖ్యంగా యూజర్ల ప్రైవసీ కి పెద్దపీట వేస్తూ వాట్సాప్ నిత్యం ఏదో ఒక ఫీచర్ను పరిచయం చేస్తూ వస్తుంది. దీంతో సహజంగానే పాత ఆపరేటింగ్ సిస్టంలో పనిచేసే ఫోన్స్ లో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తుంది. ఇప్పటివరకు చాలా సార్లు వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోన్లకు తన సేవలను నిలిపి వేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 24 నుంచి తమ సేవలను నిలిపివేయనున్నట్లు వాట్సాప్ అధికారికంగా వెల్లడించింది. ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టం తో పాటు అంతకంటే తక్కువ వర్షన్ తో పనిచేస్తున్న ఫోన్లలో ఇకపై వాట్సాప్ పని చేయదు.
ఆ ఫోన్ల జాబితాలో నెక్సస్ 7, సామ్‌సంగ్ గ్యాలక్సీ నోట్2, హెచ్‌టీసీ వన్, సోనీ ఎక్స్‌పీరియా జడ్, ఎల్‌జీ ఆప్టిమస్ జీ ప్రో, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్2, సామ్‌సంగ్ గ్యాలక్సీ నెక్సస్, హెచ్‌టీసీ సెన్సేషన్, మోటోరోలా డ్రాయిడ్ రేజర్, సోనీ ఎక్స్‌పీరియా ఎస్2, మోటోరోలా జూమ్, సామ్‌సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ 10.1, ఆసుస్ ఈ ప్యాడ్ ట్రాన్స్ ఫార్మర్, ఏసర్ ఐసోనియా ట్యాబ్ ఏ 5003, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్, హెచ్‌టీసీ డిజైర్ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్ 2 ఎక్స్, సోనీ ఎరిక్స్ ఎక్స్‌పీరియా ఆర్క్ 3 ఫోన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్లన్నీ మార్కెట్లో పెద్దగా ఉపయోగంలో లేవు. కానీ ఒకవేళ ఎవరైనా ఆ ఫోన్లను ఉపయోగిస్తుంటే వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 5.0, ఐఫోన్ 12 ఫోన్‌లలో వాట్సాప్ సేవలు కొనసాగనున్నాయి.