WhatsApp : వాట్సాప్ కొత్త ఫీచర్… ఇకపై అలాంటివి కుదరవు !
WhatsApp : ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే అందులో తప్పనిసరిగా వాట్సాప్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాట్సాప్ ను విపరీతంగా వాడుతున్నారు. అయితే వాట్సాప్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు వ్యక్తిగత గోప్యత కోసం వాట్సాప్ సంవత్సరం క్రితం వ్యూ వన్స్ ఫీచర్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా పంపే ఫోటోలు, వీడియోలను యూజర్లు ఒక్కసారే చూడగలరు. ఇవి ఫోన్ గ్యాలరీలోనూ సేవ్ కావు. స్క్రీన్ షాట్ కూడా తీయలేరు. కానీ డెస్క్ టాప్ వర్షన్ లో ప్రింట్ స్క్రీన్ ఇతర టూల్స్ తో ఫైల్స్ స్క్రీన్ షాట్ తీస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. దీంతో డెస్క టాప్ వెబ్ వర్షన్ లో కూడా వ్యూ వన్స్ ఫ్యూచర్ ను పూర్తిగా తొలగించింది.
అలాగే మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్ యూజర్ లకి కూడా మరో షాకింగ్ న్యూస్ తగిలింది. ట్విట్టర్లో కొత్త సీఈవో ఎలన్ మాస్క్ సంస్కరణలో భాగంగా యూజర్లకు మరో షాక్ ఇచ్చారు. ప్రముఖులు పాపులర్ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి సరదాగా కంటెంట్లు పోస్ట్ చేసేవాళ్లను కంట్రోల్ చేయాలని నిర్ణయించారు. పేరడీ అని లేబుల్ లేకుండా కొనసాగే అకౌంట్లో పై శాశ్వతంగా క్లోజ్ చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం తన ట్వీట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ట్విట్టర్లో కొందరు ఫన్నీ కంటెంట్ క్రియేట్ చేసి ప్రముఖుల పేరిట పాపులర్ పేర్లను ఉపయోగించి పేరడీ అకౌంట్లతో కొనసాగుతున్నారు. అయితే ఇకపై వాళ్ల ఆటలు కొనసాగవని క్లారిటీగా పేర్కొన్నారు.
లేకుంటే ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆ అకౌంట్లను శాశ్వతంగా తొలగిస్తారు. గతంలో ముందుగా హెచ్చరించిన తర్వాతే చర్యలు చూసుకునే వాళ్ళు కానీ ఇకపై ఫన్నీ కంటెంట్లు చేయడం కుదరదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. ఖాతా సైన్ అప్ అయ్యే టైంలో ఈ మేరకు ఇకపై షరతులు ఆ విషయం స్పష్టం చేయనుంది. ట్విట్టర్ ఇకముందు వార్నింగ్ ఇవ్వకుండానే అకౌంట్ పై చర్యలు తీసుకుంటామని ఎలన్ మాస్క్ మరోసారి తెలిపారు. ఇదిలా ఉంటే ఎలన్ మాస్క్ పేరిట వెరిఫైడ్ మార్క్ తో ప్రొఫైల్ నుంచి భోజ్ పూరి పదాలతో ట్రీట్ విపరీతంగా వైరల్ అయింది. అది పేరడీ అకౌంట్ కావడంతో ట్విట్టర్ దానిని తొలగించింది. పేరడీ విషయంలోనే కాదు పేరు ఏదైనా మార్పు వస్తే నష్టం తప్పదని ఎలన్ మస్క్ వెల్లడించారు.