Whatsapp : మీ వాట్సాప్ హ్యాక్ అవుతుందేమోనని భయపడుతున్నారా.. ఇలా చేస్తే టెన్షన్ అక్కర్లేదు..!
ప్రధానాంశాలు:
Whatsapp : మీ వాట్సాప్ హ్యాక్ అవుతుందేమోనని భయపడుతున్నారా.. ఇలా చేస్తే టెన్షన్ అక్కర్లేదు..!
Whatsapp : వాట్సాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అనే విషయం మనందరికి తెలిసిందే. అయితే వాట్సాప్‌ను హ్యాక్ చేయవచ్చా? మన వాట్సాప్ ను ఎవరైనా హ్యాక్ చేస్తే మనకు ఎలా తెలుస్తుంది ? అనేది కొందరికి తెలియకపోవచ్చు. వాట్సాప్‌ని ఖచ్చితంగా హ్యాక్ చేయవచ్చు. హ్యాకర్లు అనేక రకాలుగా వాట్సాప్‌లోకి ప్రవేశించవచ్చు. ఈ పద్ధతులను నేరుగా హ్యాకింగ్ అని పిలవలేము. అయితే యూజర్లను మోసం చేయడం ద్వారా యాప్‌లోకి ఎంట్రీ ఇవ్వడంలో హ్యాకర్లు సక్సెస్ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక వాట్సాప్ హ్యాకింగ్ కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి.
Whatsapp ఇలా చేయండి..
మీ వాట్సాప్‌లో మీరు యాడ్ చేయని కొత్త వ్యక్తులు కూడా మీకు కనిపిస్తున్నట్లైతే మీ వాట్సాప్ ఖాతాను మరొకరు ఉపయోగిస్తున్నారనే సంకేతంగా పరిగణించబడుతుంది. మీకు వారు పరిచయం కోసం సందేశం పంపిస్తే అలాంటి వాటికి స్పందించకూడదు. మీరు ఎలాంటి లింక్‌పై క్లిక్ చేయకుండా ఉండాలి. మీ వాట్సాప్‌ను ఎవరో హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఈ రకమైన సందేశానికి అర్థం . అయితే మీ వాట్సాప్‌ని సురక్షితంగా ఉంచుకునేందుకు ఇలాంటి స్టెప్స్ ఫాలో అయితే మంచిది.ఫోన్ లోని వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఇందులో ప్రైవసీ పై క్లిక్ చేయగానే ఇందులో గ్రూప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులోకి వెళ్లగా ఎవ్రీ వన్‌పై టిక్ చేసి ఉంటుంది. దీనిని తీసేసి మై కాంటాక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల కాంటాక్ట్ ఉన్నవారు మాత్రమే గ్రూప్ లోకి యాడ్ చేస్తారు. కొత్తవారు యాడ్ చేయడానికి అవకాశం ఉండదు. రెండో ఆప్షన్ ఏంటంటే ప్రైవసీ లోకి వెళ్లి కాల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్లగా సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ అనేది ఆఫ్ అయి ఉంటుంది. కానీ దీనిని ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరు హ్యాకర్లు కాల్స్ చేస్తుంటారు. ఇవి ఒక్కోసారి మనం గుర్తించలేం. అందువల్ల ఇది ఆన్ చేయడం వల్ల కాంటాక్ట్ లేని కాల్స్ రాకుండా ఉంటాయి. ఇందులోనే అడ్వాన్స్‌డ్ అనే ఆప్షన్ లోకి వెళ్లి ప్రొటక్ట్ ఐపీ అడ్రస్ కాల్స్ అనే దానిపై క్లిక్ చేసి ఆన్ చేయాలి. దీంతో స్కామర్లు లైవ్ లోకేషన్ ను గుర్తించలేదు. మూడో ఆప్షన్ లో అకౌంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లాలి. ఇప్పుడు టూ స్టెప్ వెరిఫికేషన్ ను ఆన్ చేసుకోవాలి. దీంతో వాట్సాప్ ను ఓపెన్ చేయాలంటే కొత్తవారికి సాధ్యం కాదు. అంతేకాకుండా ఇది పాస్ వర్డ్ తో క్రియేట్ అయి ఉంటుంది. whatsapp to avoid being hacked then follow these 3 simple steps