WhatsApp : మార్పుల దిశగా వాట్సాప్.. కొన్ని లిమిట్స్ అమలు చేసేందుకు సిద్ధం..!
ప్రధానాంశాలు:
WhatsApp : మార్పుల దిశగా వాట్సాప్..కొన్ని లిమిట్స్ అమలు చేసేందుకు సిద్ధం..!
WhatsApp : ఈ రోజుల్లో వాట్సాప్ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. నిత్యం వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ కాలాయాపన చేసే వాళ్లుఎంతో మంది ఉన్నారు.ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ వలన దుర్వినియోగం కూడా జరుగుతుంది. వాట్సాప్ వినియోగంలోనూ దొంగలు పడుతున్నారు. నకిలీ ఖాతాలు సృష్టించి.. సమాజాన్ని భయాందోళనలకు గురిచేయడమే కాదు.. నకిలీ ఖాతాల ద్వారా.. జనాల సొమ్మును వివిధ మార్గాల్లో గేమింగ్ పేరిట, పొదుపు పేరిట, అధిక ఆదాయాల పేరిట కూడా దోచేస్తున్నారు. ఈ క్రమంలో చెడు ఖాతాలపై కొరడా ఝళిపించింది.
WhatsApp ఈ లైన్ క్రాస్ చేయోద్దు..
ఒక్క సెప్టెంబరు నెలలోనే 85 లక్షల ఖాతాలపై నిషేధం విధించింది. ఈ ఖాతాలు నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని వాట్సాప్ గుర్తించింది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వాట్సాప్ మొత్తం 85,84,000 ఖాతాలను నిషేధించింది. వీటిలో 16,58,000 ఖాతాలను ఎలాంటి ఫిర్యాదులు రాకముందే నిషేధించింది. వాట్సాప్ కు భారత్ లో 60 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో, వాట్సాప్ స్పందిస్తూ… పారదర్శకంగా వ్యవహరించడాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని, తమ చర్యలకు సంబంధించిన సమాచారాన్ని భవిష్యత్ నివేదికల్లో పొందుపరుస్తామని స్పష్టం చేసింది. ఒక్క సెప్టెంబరు మాసంలోనే అనుమానిత 85 లక్షలకుపైగా వాట్సాప్ ఖాతాను నిషేధించారు.
అందుకు కారణం సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే సందేశాలు పంపడం, వివాదాలకు నెలవుగా వాట్సాప్‌ను మార్చడం, అవాంఛనీయ కంటెంట్, విధానపరమైన నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇలా నిషేధం విధించిన ఖాతాల్లో 16,58,000 ఖాతాలకు సంబంధించి ఎవరూ స్పందించలేదు. అంటే.. ఈ ఖాతాలన్నీ.. నకిలీవే. సమాజాన్ని ప్రజలను దోచుకునేవేనని అర్థమైంది. అభ్యంతరకర కంటెంట్‌ను నివారించేందుకు యూజర్లు తమకు నచ్చని ఖాతాలను బ్లాక్ చేయగల సౌకర్యాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక, ఇలాంటి విషయాలపై కంపెనీకి నేరుగా ఫిర్యాదు చేసే విధానం కూడా యాప్‌లో అమలు చేస్తోంది. వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా తమ నియమావళిని పకడ్బందీగా పాటించడంలో తాము నిర్లక్ష్యం చేయబోమని వాట్సాప్ స్పష్టం చేసింది.