Peerzadiguda : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రధానాంశాలు:
Peerzadiguda : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Peerzadiguda : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని 76th Republic Day ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ అమర్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. ఈ వేడుకలో స్వీపింగ్ మిషన్ ప్రారంభం, సిటిజన్స్ కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవం,రక్తదాన శిబిరం వంటి కార్యక్రమాలు నిర్వహించబడాయి.
Peerzadiguda స్వీపింగ్ మిషన్ ప్రారంభం
మేయర్ అమర్ సింగ్,డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, ఇతర అధికారులు కలిసి కొత్త స్వీపింగ్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ మిషన్ ద్వారా పిర్జాదిగూడ మరింత పరిశుభ్రంగా మారుతుందని మేయర్ తెలిపారు.
Peerzadiguda సిటిజన్స్ కమాండ్ కంట్రోల్ ప్రారంభం
నగర పరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలను త్వరగా తెలియజేసేందుకు, వాటి పరిష్కారాన్ని మానిటర్ చేయడానికీ ఇది ఉపయోగపడుతుందని మేయర్ అన్నారు.రక్తదాన శిబిరం: ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వర్ రావు,డిఈ సాయి నాథ్ గౌడ్,మేనేజర్ కిషోర్, రెవిన్యూ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.