Tripathi : ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక నిర్మాణంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు : నల్లగొండ జిల్లా కలెక్టర్
ప్రధానాంశాలు:
Tripathi : ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక నిర్మాణంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు : నల్లగొండ జిల్లా కలెక్టర్
Tripathi : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి అన్నారు. గ్రౌండింగ్ (బేస్ మెంట్ ) మొదలుకొని ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పూర్తి పారదర్శకత ప్రదర్శించాలని అన్నారు.గురువారం ఆమె నల్గొండ జిల్లా,దామరచర్ల ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి

Tripathi : ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక నిర్మాణంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు : నల్లగొండ జిల్లా కలెక్టర్
Tripathi నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి దామచర్ల ఎంపీడీవో కార్యాలయ రికార్డులు అకస్మికతనికి
సంబంధిత రికార్డులను పరిశీలించి అనంతరం ఎంపీడీవో,తహసిల్దార్,మండల ప్రత్యేక అధికారి ,గృహ నిర్మాణ శాఖ అధికారులతో సంయుక్తంగా ఇందిరమ్మ ఇండ్ల పై సమీక్షించారు.లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా చూడాలని తెలియజేశారు.
ఇండ్లు నిర్మించుకున్న వారికి నిబంధనల మేరకు వివిధ స్థాయిలలో చెల్లింపులు చేయాలని,అలాగే ఇళ్ల నిర్మాణంలో విమర్శలు, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వవద్దని హెచ్చరికలను జారీ చేశారు.ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన లబ్ధిదారులు వారి ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలకు లోబడి ఇల్లు నిర్మించుకున్న వారికి మాత్రమే బిల్లుల చెల్లింపు జరుగుతుందని,ఈ విషయంలో లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు,ప్రజలు అందరూ సహకరించాలని తెలియచేశారు.