Amrutha Pranay : అమృత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది..?
ప్రధానాంశాలు:
Amrutha Pranay : అమృత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది..?
Amrutha Pranay : 2018లో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన ప్రియుడైన ప్రణయ్‌ను కిరాతకంగా హత్య చేసిన ఘటనకు బాధ్యులైన వారికి కోర్టు కఠిన శిక్షలు విధించింది. అమృత, ప్రణయ్‌ల ప్రేమ వివాహం ఇంట్లో పెద్దల అభిమతానికి విరుద్ధంగా ఉండటంతో అమృత తండ్రి కుట్ర పన్ని ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ కేసులో న్యాయస్థానం ప్రధాన నిందితుడైన A2 వ్యక్తికి ఉరి శిక్ష, మరో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుతో ప్రణయ్ కుటుంబం, సమాజం న్యాయం జరిగిందని భావిస్తూ హర్షం వ్యక్తం చేసింది.

Amrutha Pranay : అమృత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది..?
Amrutha Pranay అమృత పై నెటిజన్లు ఆగ్రహం
తీర్పు వెలువడిన తర్వాత అమృత తన సోషల్ మీడియా ఖాతాలో ‘అమృత ప్రణయ్’ అనే పేరును ‘అమృత వర్షిణి’ గా మార్చుకుంది. ఈ పరిణామం నెటిజన్లలో కొత్త చర్చకు తెరతీసింది. హత్య కేసులో న్యాయం సాధించుకున్న తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ పేరుమార్పు చేసింది అని కొందరు భావిస్తున్నారు. మరికొందరు, ఆమె త్వరలోనే మరో పెళ్లి చేసుకునే యోచనలో ఉందా? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అయితే ఆమె “Rest In Peace” అనే స్టోరీ షేర్ చేయడం, ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరిందనే అర్థాన్ని కలిగిస్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అమృత, గత ఐదేళ్లుగా యూట్యూబ్ వ్లాగ్‌లు చేస్తూ, తన జీవితం గురించి అభిమానులతో షేర్ చేసుకుంటోంది. తాజా తీర్పు తర్వాత ఆమె తీసుకున్న ఈ నిర్ణయం నెటిజన్లను ఆసక్తిగా మారుస్తోంది. అసలు పేరుమార్పు వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి?, ఆమె నిజంగానే కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటుందా? అనే విషయంపై అమృత స్వయంగా స్పందిస్తుందా? లేదా అన్నది వేచిచూడాలి. ఏదేమైనా, కోర్టు తీర్పుతో ప్రణయ్ కుటుంబం, సమాజం కొంతమేర న్యాయం జరిగిన భావనతో ఊపిరి పీల్చుకుంది.