New Ration Cards : కొత్త రేష‌న్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

New Ration Cards : కొత్త రేష‌న్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

New Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి కీల‌క అప్‌డేట్ ఒక‌టి వ‌చ్చింది. కొత్త కార్డులు తొందర‌లోనే రానున్నాయి. కొత్త రేషన్ కార్డులు కొత్త ఏడాది నుంచి అందుబాటులోకి రావొచ్చు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే కొత్త కార్డుల డిజైన్ అంశంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంటే కొత్త ఏడాదిలో కొత్త రేషన్ కార్డులు లభించనున్నాయని […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 November 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  New Ration Cards : కొత్త రేష‌న్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

New Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి కీల‌క అప్‌డేట్ ఒక‌టి వ‌చ్చింది. కొత్త కార్డులు తొందర‌లోనే రానున్నాయి. కొత్త రేషన్ కార్డులు కొత్త ఏడాది నుంచి అందుబాటులోకి రావొచ్చు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే కొత్త కార్డుల డిజైన్ అంశంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంటే కొత్త ఏడాదిలో కొత్త రేషన్ కార్డులు లభించనున్నాయని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. అర్హతలను ఖరారు చేసింది. పాత రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి జారీ చేయనుంది. అదే విధంగా సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదికగా మారటంతో అర్హతల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.

కొత్తగా వివాహం చేసుకున్న జంటలతో పాటుగా ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాలను అనుగుణంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రీ డిజైనింగ్ చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసి కొత్తగా అందరికీ కొత్త డిజైన్ తో కార్డులు అందించనున్నారు. ఇప్పటికే లేత పసుపు రంగు కార్డుపై రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముద్రించిన నమూనాను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. గత ప్రభుత్వంలో కొత్త కార్డుల కోసం వచ్చిన 30,611 దరఖాస్తులతో పాటు స్ల్పిట్‌ కార్డుల కోసం 46,918 వచ్చాయి. సభ్యుల చేర్పుల కోసం 2,13,007 దరఖాస్తులు రాగా.. ఇక, తొలగింపు కోసం వచ్చినవి 36,588 గా అధికారులు వెల్లడించారు.

New Ration Cards కొత్త రేష‌న్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

New Ration Cards : కొత్త రేష‌న్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

చిరునామా మార్పు కోసం వచ్చిన 8,263 దరఖాస్తులతో పాటుగా కార్డుల సరెండర్‌ కోసం వచ్చినవి 685 ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 3,36,072 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిల్లో 90 లక్షల కార్డులను జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించారు. వీటికి ఉచిత బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరుకులపై రాయితీ అందుతోంది. మిగిలిన కార్డులకు ఉచిత బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, రాగులు తదితర సరుకులు అందుతున్నాయి. జనవరిలో జన్మభూమి -2 ప్రారంభానికి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఆ సమయంలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది