New Ration Cards : కొత్త రేషన్ కార్డు దారులకు ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Ration Cards : కొత్త రేషన్ కార్డు దారులకు ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు

 Authored By ramu | The Telugu News | Updated on :15 May 2025,5:00 pm

New Ration Cards : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. మే 8 నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యాయి. కొత్త రేషన్ కార్డు అవసరమైన వారు తమ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి అవసరమైన సమాచారం అందించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపై మరింత సౌకర్యంగా ఈరోజు (మే 15 ) నుంచి “మన మిత్ర” వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రజలు ఇంటివద్ద నుంచే సులభంగా దరఖాస్తు చేయగలుగుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల విభజన (స్పిల్టింగ్) కోసం కూడా అవకాశం కల్పించారు.

కొత్తగా పెళ్లైన జంటలు, వేరుగా కాపురం చేస్తున్న వారు తమ సొంతగా తమకంటూ కార్డు లను అప్లయ్ చేసుకోవచ్చు..దీనికోసం స్పిల్టింగ్ అంటూ అప్లై చేసుకోవచ్చు. గతంలో దీనిని పొందడానికి వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు దీనికి అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అలాగే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన వారు డిలీషన్ సేవను ఉపయోగించుకోవచ్చు. ఇదే సమయంలో రేషన్ కార్డు వదులుకోవాలనుకునేవారికి కూడా స్వచ్ఛందంగా కార్డు తొలగించుకునే అవకాశాన్ని కల్పించారు.

New Ration Cards కొత్త రేషన్ కార్డు దారులకు ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు

New Ration Cards : కొత్త రేషన్ కార్డు దారులకు ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు

ఇంకా మరిన్ని కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తుంది. వివాహం కాని, 50 ఏళ్లు దాటిన ఒంటరి వ్యక్తులకు, ఆశ్రమాల్లో నివసిస్తున్నవారికి, లింగమార్పిడి చేయించుకున్నవారికి కూడా రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. అంతేకాకుండా కళలను కొనసాగిస్తున్న కళాకారులు, అంతరించిపోతున్న కళలకు జీవం పోసే వారికి అంత్యోదయ అన్న యోజన కింద 35 కేజీల బియ్యం ఇచ్చే విధంగా కార్డులు జారీ చేయనున్నారు. ఏలూరు, అల్లూరి జిల్లాల్లోని కొండప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కూడా ఈ కార్డులు వర్తిస్తాయి. రేషన్ కార్డు అవసరమైన వారు ఇక సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో, దీనివల్ల వేలాది మందికి ఉపశమనం లభించనుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది