Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కి అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కి అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..!
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుండడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. జూన్ 2వ తేదీన ఐదు లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం మంజూరు పత్రాలు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని ఇటీవల భట్టి అన్నారు.

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కి అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్..!
Rajiv Yuva Vikasam Scheme : శుభవార్త..
అయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు అప్లై చేసుకున్న వారికి శుభవార్త. ఈ ఏడాది అక్టోబర్ 2లోగా 5 లక్షల మందికి దశల వారీగా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించారు. ఈ విషయాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు. వచ్చే నెల 2 నుంచి 9 వరకు మంజూరు పత్రాలను ఇస్తారు.రూ.8,000 కోట్లతో 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని భట్టి విక్రమార్క చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ప్రతి నెల ఇన్చార్జ్ మంత్రులు, కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. కాగా, ఈ స్కీమ్‌లో భాగంగా తొలి విడతగా రూ.లక్షలోపు యూనిట్లకు సబ్సిడీ ప్రొసీడింగ్స్ ఇస్తారు. అనంతరం దశలవారీగా రూ.4 లక్షల యూనిట్ వరకు ఇస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రాజీవ్ యువ వికాసంలో చాలా మంది రూ.2 లక్షలు – 4 లక్షల మధ్య విలువైన యూనిట్లకే దరఖాస్తులు చేసుకున్నారు.